బాలీవుడ్లో తాము చేసే మొదటి సినిమాని ఎంతో స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు.. ఎందుకంటే దాని తర్వాత వచ్చే ఫలితాన్ని బట్టి మార్కెట్ తో పాటు అవకాశాలు కూడా బాగా పెరుగుతాయి. మొదటి ఫలితం ఏమాత్రం తేడా కొట్టిన ఆశలకే మోసం వచ్చేస్తుంది.. ఇక కీర్తి సురేష్ కు ఇప్పుడిది అనుభవమవుతుంది. వరుణ్ ధావన్ కు జంటగా చేసిన బేబీ జాన్ బాక్సాఫీస్ దగ్గర గట్టిగా షాక్ ఇచ్చింది. నిజానికి ఎంట్రీ ఇవ్వాల్సింది ఇలాంటి క్యారెక్టర్ తో కాదు .. ఎందుకంటే ఒరిజినల్ వెర్షన్ తేరీలో సమంత కూడా చనిపోయే క్యారెక్టర్ లో నటించింది. కానీ అది విజయ్ ఇమేజ్ ఎలివేషన్ మీద నడిచే కథ కావటంతో కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. కానీ వరుణ్ కి ఉన్న ఇమేజ్ అంతటి క్రేజ్ సినిమాకు సాధించలేడనేది వాస్తవం.అలాంటి క్రమంలో కీర్తి సురేష్ రెండు పాటల్లో డాన్స్ చేసి చనిపోయే క్యారెక్టర్ ద్వారా నార్త్ ప్రేక్షకులకు దగ్గరవడం అనేది కష్టం.. అసలే బేబీ జాన్ ఓవర్ మాస్ యాక్షన్ మసాలా.. దర్శకుడు అట్లీ అడిగాడు కదా అని చేసింది గాని దాని ప్రభావం ఎలా ఉంటుందో ముందుగా ఊహించి ఉండదు.. పైగా ఇదేదో పెద్ద బ్రేక్ అవుతుందని భావించి పెళ్లి జరిగిన వెంటనే ఎలాంటి రెస్ట్ లేకుండా ప్రమోషన్ లో పాల్గొనడం కీర్తి సురేష్ కి ఎలాంటి బెన్ఫిట్ ఇవ్వలేకపోయింది.. బేబీ జాన్‌లో మరో హీరోయిన్ వామికా గబ్బి పరిస్థితి ఇంతకన్నా దీనంగా మారిపోయింది.. సినిమాలో క్యారెక్టర్ పరంగా కొంచెం బెటర్గా అనిపించింది తప్ప బెస్ట్ అయితే ఏం లేదు.
ఇక గతంలో ఇలా హిందీ సినిమాల్లో నటించే షాక్ ఇతన్న సౌత్ హీరోయిన్లు గట్టిగానే ఉన్నారు .. శాలిని పాండే, త్రిష , కాజల్ అగర్వాల్ , శ్రియ శరన్ , తమన్నా వంటి వాళ్ళు ఏదో ఒకటి రెండు విజయాలు తప్ప తముదైన ముద్ర వేయలేకపోయారు .. మొదటి సినిమానే నార్త్‌లో మొదలుపెట్టిన పూజా హెగ్డే కు ఇన్ని సంవత్సరాలు తర్వాత కూడా గర్వంగా చెప్పుకుని బ్లాక్ బాస్టర్ ఒకటి కూడా లేదు. కానీ తెలుగులో మాత్రం బోలెడు హిట్లు ఉన్నాయి. అందుకే దూరపు కొండలు నునుపు తరహాలో ఏదో పెద్ద క్రేజ్ బ్రేక్ వస్తుందని తప్ప వెనక్కి వచ్చే బాపతే ఎక్కువగా కనిపిస్తున్నారు.. ఇక చివరిగా చెప్పేదేమిటంటే కీర్తి సురేష్ కి బాలీవుడ్ ఎంట్రీ గట్టి దెబ్బ కొట్టింది.