టాలీవుడ్‌లో ఇప్పటికే ఎంతో మంది హీరోలు.. స్టార్ హీరోలుగా తమకట్టు ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకోవడానికి ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలోనే భారీ రికార్డులను కొల్లగొడుతూ పాన్ ఇండియా హీరోలుగా రాణిస్తున్నారు. ఇక తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా ఆదరణ అందిస్తున్నప్పటికీ.. ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని అనవసర పనుల వల్ల టాలీవుడ్ అంతా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది.
నిజానికి పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన.. సంధ్య థియేటర్ ఘటన ఇండస్ట్రీలో బెనిఫిట్స్, ప్రీవియర్స్ పర్మిషన్ లేకుండా చేసేసింది. ఇక.. ఇప్పటికైనా బన్నీ, రేవంత్ ల మధ్య వివాదం తగ్గుముఖం పట్టిందా.. లేదా కేసులు రేవంత్ రెడ్డి అసలు వద్దులే ప్రసక్తే లేదా.. ఇక జనవరి 10న ఏం జరగనుంది. బెయుల్ గడువు ముగుస్తున్న క్రమంలో బన్ని ఎలాంటి సమాధానం చెప్పనున్నాడు.. ఈ కేసులో అల్లు అర్జున్ అరస్ట్ అవుతాడా.. సేఫ్ అవుతాడా అనే సందేహాలు జనాల్లో మొదలయ్యాయి.
ఇక.. తనదైన స్టైల్‌లో సత్తా చాటుకుంటున్న బన్నీ ఈ కేసు విషయంలో.. తన ఇమేజ్ భారీగా తగ్గించుకుంటున్నాడు. చాలామంది సినీ ప్రముఖులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏదేమైనా పుష్ప 2 సినిమాతో బన్నీ భారీ ఇమేజ్ సంపాదించకున్న క్రమంలో ఫ్యూచర్‌లో అంతకు మించిన సక్సెస్ సాధించాల్సి ఉంది. అయితే ఆయన ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తే.. ఫ్యూచర్‌లో తన సినీ కెరీర్‌పై భారీ ఎఫెక్ట్ పడుతుందనటంలో సందేహం లేదు. ఇక జనవరి 10న ఏం జరుగుతుందో వేచి చూడాలి.