టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఎప్పుడు ప్రైవేట్ లైఫ్‌కి ఇంపార్టెన్స్ ఇస్తుంటాడు. అయితే సినిమాలు, లేదంటే ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు. మీడియాకు ఆయన చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇక అన్న సురేష్ బాబు నిర్మాత కావడంతో.. ఎప్పటికప్పుడు మీడియా ముందుకు రావాల్సి వస్తుంది. ఆయన సినిమాలకు సంబంధించి ఎన్నో విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. కాగా.. తాజాగా వెంకటేష్ తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య అన్ స్టాపబుల్‌షోలో సందడి చేశాడు. సినిమాకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. అంతేకాదు.. తన పర్సనల్, ఫ్యామిలీ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు వెంకీ.
తన భార్య, పిల్లల గురించి, రానా, నాగచైతన్య ల గురించి, అన్న గురించి ఎన్నో విషయాలు వెల్లడించాడు. కొడుకు అర్జున్ సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం అర్జున్ ఫారెన్‌లో చదువుతున్నాడని.. నటనకు ఇంకా సమయం పడుతుందని.. తన ఇష్టం తను ఏది చూజ్ చేసుకుంటే అదే.. ఫోర్సె ఏమి ఉండదని చెప్పుకొచ్చాడు. ఇక అన్న సురేష్ బాబు గురించి ఆయన చెబుతూ.. ఇద్దరం చూస్తాం. అందరి బాధ్యతలు అన్న పెద్ద దిక్కుగా చూస్తున్నాడని ఎమోషనల్ అయ్యాడు వెం తన నాన్న చనిపోయిన తర్వాత అన్ని బాధ్యతలు అన్న తీసుకున్నాడని.. మా పిల్లలు తన పిల్లలు అని ఎప్పుడు అనుకోయు మాకు ఎనిమిది మంది పిల్లలనికీ. సురేష్ బాబు కూడా ఆయన మాటలకు ఎమోషనల్ అయ్యాడు.
స్క్రిప్ట్ సెలక్షన్ లో తనదే ఫైనల్ డెసిషన్. ఆయన ఇది వద్దని చెబితే.. ఆ సినిమా ఫ్లాపే. అలా చేసిన సినిమా డిజాస్టర్ అయిందంటూ వెంకీ చెప్పుకొచ్చాడు. అయితే వెంకీకి వచ్చి సినిమా చేస్తే సూపర్ హిట్ అని.. తన నిర్ణయంతో చేసన సినిమాలో యావరేజ్, హిట్లు మాత్రమే అది సురేష్ బాబు వెల్లడించాడు. తండ్రి రామానాయిడును గుర్తు చేసుకున్న ఈ అన్నదమ్ములు ఇద్దరు ఆయన కోరికలు తీర్చలేకపోయాం అంటూ ఎమోషనల్ అయ్యారు. చివరి రోజుల్లో కూడా ఆయనకు సినిమాలు తీయాలనుండేది. ఆరోగ్యం బాగోలేకపోయినా.. స్క్రిప్ట్ చదివేవాడు. చివర్లో వెంకటేష్ తో సూపర్ హిట్ సినిమా చేయాలని ఆయన అనుకున్నారు.
అందులో తను కూడా నటించాలని భావించాడు. కానీ.. అది వర్కౌట్ కాలేదు.. చనిపోవడానికి ముందు కూడా సినిమా సినిమా అదే ధ్యాసలోనే ఉండేవారు అంటూ వెల్లడించారు. ఆయన చివరి కోరిక ఒక సక్సెస్ఫుల్ సినిమా అది చేయలేకపోయాం అనే బాధ అలా ఉండిపోయిందని.. అది తలుచుకున్నప్పుడల్లా తమను వేధిస్తుందని వెంకటేష్ వివరించాడు. నాన్న కోరికలు చాలా నెరవేర్చం. తన ల్యాండ్లో కృషి విద్యాలయ ఏర్పాటు చేయాలనుకున్నారు అది పూర్తయింది. కానీ.. రెండు కోరికలు తీర్చలేకపోయాం. అది ఒకటి సినిమా చేయడం, రెండోది ఆయన ఎంపీగా గెలవడం. నాన్న ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆ టైపులో చాలా కృంగిపోయారు. గెలుపు దక్కలేదని చాలా రోజులు బాధపడ్డారు అంటూ సురేష్ బాబు చెప్పుకొచ్చాడు. నాన్నగారు ఈ రెండు కోరికలు తీరకుండానే వెళ్లిపోయారని బాధ ఇప్పటికీ వెంటాడుతుందని సురేష్ బాబు ఎమోషనల్ అయ్యాడు. ఆయన ఎప్పుడు గుర్తుకొచ్చిన ఈ రెండు అంశాలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయంటూ సురేష్ బాబు ఎమోషనల్ అయ్యారు.