ట్రైలర్ రిలీజ్ చేయకపోతే చచ్చిపోతా.. గేమ్ ఛేంజర్ యూనిట్‌క రామ్ చరణ్ ఫ్యాన్ సూసైడ్ లెటర్..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చే సంక్రాంతికి కనుకగా జనవరి 10న‌ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న గేమ్ ఛేంజ‌ర్ మూవీ పై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కి పట్టుమని ఇంకా 15 రోజులు కూడా సమయం లేదు.. అయినప్పటికీ మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు అసలు పెంచలేదు .. ఇక దాంతో అభిమానులు ఈ మూవీ అప్డేట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు .. ఇదే క్రమంలో తాజాగా ఓ రామ్ చరణ్ అభిమాని సోషల్ మీడియా వేదికగా గేమ్ ఛేంజర్‌ ట్రైలర్ను రిలీజ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటాను అంటూ గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ గా సూసైడ్ లెటర్ పంపాడు.

గేమ్ ఛేంజర్: రాజమండ్రికి బయలుదేరిన రామ్ చరణ్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

రామ్ చరణ్ సోలో హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చి దాదాపు 5 సంవ‌త్స‌ర‌లు అవుతుంది.. త్రిబుల్ ఆర్ , ఆచార్య వంటి సినిమాల్లో నటించినప్పటికీ అవి రెండు మల్టీస్టారర్ సినిమాలు .. ఇక దాంతో సోలో హీరోగా రామ్ చరణ్ నుంచి వచ్చే మూవీ కోసం ఎప్పటి నుంచి అభిమానులు ఎదురు చూస్తున్నారు .. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతున్న క్రమంలో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.. అలాగే స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథ అందించగా కీయ‌ర అద్వానీ హీరోయిన్గా నటించింది .. ఇప్పటికే టీజర్ , సాంగ్స్ సినిమా హైప్‌ను విపరీతంగా పెంచేసాయి.. ఇక దీంతో ట్రైలర్ ని ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ చేస్తారా ? అంటూ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే నిజానికి అమెరికాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ చేంజ‌ర్‌ ట్రైలర్ను రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు .. కానీ అక్కడ ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంతో అందరూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు డిసెంబర్ 30న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారని కొత్త ఏడాది సందర్భంగా రాబోతున్న ఈ ట్రైలర్ మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇవ్వబోతుందని కూడా అంటున్నారు. ఇక ప్రస్తుతం శంకర్ అండ్ టీం దినికి సంబంధించిన వర్క్ లో బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడ మరో వార్త బయటకు వచ్చింది.. గేమ్ చేంజ‌ర్‌ ట్రైలర్ ని సినిమా రిలీజ్ కు ఐదు రోజులు ముందు రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేశారని కూడా అంటున్నారు .. ఇక దాంతో అభిమానులకు అంత అయోమయంలో పడ్డారు .. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా గేమ్ చేంజర్ యూనిట్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్' అప్డేట్.. హైదరాబాద్‌లో వారం రోజులపాటు షూటింగ్ - Mana Telangana

ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ అభిమాని ఒకరు సోషల్ మీడియాలో ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే చనిపోతాను అంటూ లెటర్ రాశారు .. సినిమా రిలీజ్ కి ఇంకా 13 రోజులు సమయం మాత్రమే ఉన్నప్పటికీ ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు .. అభిమానుల ఎమోషన్స్ ను మేకర్స్ పట్టించుకోవట్లేదు ఈ నెల చివరి లోగా ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటాను చ‌రణ్ అన్న భక్తుడు అంటూ .. అతను గేమ్ చేంజర్ మూవీ యూనిట్ కి పంపిన సూసైడ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.