ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అంచలంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు చిరంజీవి. దాదాపు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నాలుగు దశాబ్దాలు అవుతున్నా.. తెలుగులోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్న మెగాస్టార్ కెరీర్‌లోను.. ఎన్నోసార్లు బ్రేక్ పడ్డాయి. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే సాధారణంగా సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న వారెవరు స్టార్ హీరో సినిమాలు బాగోలేదని చెప్పారు. అది వివాద స్పదమౌతుందని ఆలోచిస్తారు. అలాంటిది ఒక సీనియర్ స్టార్ విలన్ మాత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా టూ వరస్ట్ అంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు.
ఇంతకీ అతను ఎవరో కాదు కోటా శ్రీనివాస్. తన అద్భుతమైన నటనతో పాటు.. ఎన్నోసార్లు సెన్సేషనల్ కామెంట్స్ చేసి వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఇక మండలాధీసుడు లాంటి సినిమాలో కోట శ్రీనివాస్.. సీనియర్ ఎన్టీఆర్ ని ఇమిటేట్ చేస్తూ తన పాత్రలో నెగిటివ్గా కనిపించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఈ సినిమాలో చూపించారు. ఈ మూవీ తర్వాత కోటా శ్రీనివాస్ పై ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అయ్యారు. ఎన్నో విధాలుగా విమర్శలు చేశారు. ఆయన పై అప్పట్లో దాడికి కూడా ప్రయత్నించారు. కానీ.. కోటా మాత్రం ఎన్టీఆర్ ని కలిసినప్పుడు తనకి వ్యతిరేకంగా నటించిన పాత్రల గురించి ఎప్పుడూ మాట్లాడలేదట.
మీరు అద్భుతమైన నటుడు బ్రదర్ అని కోటాను ప్రశంసించారట. అలా ఎన్టీఆర్‌నే కాదు.. కోట శ్రీనివాస్, చిరంజీవి సినిమాపై కూడా సంచలన కామెంట్స్ చేసి వార్తలో నిలిచారు. చిరంజీవి, నిరోషా, విజయశాంతి కలిసి నటించిన స్టువర్టుపురం పోలీస్ స్టేషన్.. 1991లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమా ఫ్లాప్ అని అందరికీ అర్థమైపోయింది. దీంతో ఫ్యాన్స్ కూడా సినిమాలు చూడలేదు.
ఇందులో భాగంగా కోటాని మూవీ ఎలా ఉందని ఓ సందర్భంలో అడిగారట. వెంటనే కోటా.. ఆ సినిమాపై జోకులు వేస్తూ ఏముందండి.. అది స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ కాదు.. టూ వరస్ట్ పురం పోలీస్ స్టేషన్ అంటూ ఓపెన్ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ చిరుకి తెలియడం.. నా సినిమా పైన జోకులు వేసావ్ ఏంటి అని ఆయన అడగగా ఉన్న విషయమేగా చెప్పాను అంటూ కోట చెప్పుకొచ్చాడట. దీంతో మెగాస్టార్ నవ్వుకొని సైలెంట్ అయ్యారని సమాచారం. ఇక కోట శ్రీనివాస్‌ను వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు.