నీ కొడుకు కోసం నా తమ్ముడిని అడుక్కోవాలా.. అరవింద్‌కు మెగాస్టార్ షాక్..!

అల్లు అర్జున్ అరెస్టు ఇష్యూపై కూడా తాజాగా మెగా ఫ్యామిలీలో విభేదాలు తలెత్తేయని.. సంధ్య థియేటర్ ఇష్యూ తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై మెగా ఫ్యామిలీలో పెద్ద యుద్ధం జరుగుతుందని సమాచారం. అల్లు అర్జున్ విషయంలో మెగాస్టార్ చాలా సీరియస్ గా ఉన్నారట. చరణ్ సినిమాతో పాటు.. తన సినిమా కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇలాంటి క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న డెసిషన్ ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని.. అంతే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో క్లారిటీ లేకపోవడంతో అల్లు అర్జున్ చేసిన ప‌న్నీపై సీరియస్ అవుతున్నాడ‌ని సమాచారం.

తెలంగాణ‌ ప్రభుత్వం.. సినిమా పెద్దల భేటీ తర్వాత చిరంజీవిని.. అల్లు అరవింద్ కలిసి భేటీలో ఏం జరిగిందో.. ఏంటి అనే విషయాలను ఆయనతో మాట్లాడాడట. అయితే డిస్కషన్ లో చిరంజీవి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కనుక.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అని చిరంజీవి అల్లు అరవింద్‌కు చిరు తన అభిప్రాయాన్ని వెల్లడించాడట. పవన్ కళ్యాణ్ తో మీరు ఒకసారి మాట్లాడితే బాగుంటుంది ఈ విషయంలో మనకు కాస్త పర్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అర‌వింద్ చెప్పగా.. చిరంజీవి దానికి నో చెప్పేసాడట.

Chiru Sends Homemade Food To Pawan | cinejosh.com

బన్నీ చేసిన తప్పు వల్ల తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి పర్మిషన్స్ ఇవ్వమని అడగాలా.. నేను వెళ్లను. గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సినిమా వాళ్ళందరి కోసం కలిసాను. ఇప్పుడు ఎవర్ని కలవాలి అనుకోవడం లేదు. ఏం జరిగితే అదే జరుగుతుందని అరవింద్ కు తెల్చి చెప్పేసాడట. ఒకవేళ మాట్లాడాలనుకుంటే నువ్వు వెళ్లి పవన్ ని కలవు. చంద్రబాబు అయితే దీనిపై సానుకూలంగా స్పందించకపోవచ్చని చిరు ఆయనతో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సినిమాల పర్మిషన్ల విషయంలో ఏం చేయాలో తెలియని అయోమయంలో అల్లు అరవింద్ పరిస్థితి ఉంది.