బాహుబలి మేకర్స్‌తో చైతు భారీ బడ్జెట్ మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోది..!

అక్కినేని ఫ్యామిలీ నుంచి వారసుడుగా అడుగు పెట్టిన నాగచైతన్య.. మీడియం హీరో నుంచి స్టార్ లీగ్ లోకి అడుగు పెట్టే సమయం వచ్చేసిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయన సెలెక్ట్ చేసుకున్న కాంబినేషన్స్ ని చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఇప్పటివరకు కేవలం లవ్ స్టోరీ సినిమాలను చేస్తూ సక్సెస్ రేట్ అందుకున్న చైతన్య.. కేవలం పరిమిత ఆడియన్స్‌ని మాత్రమే మెప్పించగలిగాడు. కానీ.. ఇప్పుడు ట్రై చేస్తున్న కొత్త జోన‌ర్‌తో అందరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని.. ఆయన క్రేజ్ మరింతగా పెరగబోతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Thandel: Naga Chaitanya turns fisherman for his next with Sai Pallavi. See  poster - India Today

ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తండేల్‌ సినిమాతో చైతు ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని.. స్టార్ హీరో రేస్ లోకి అడుగు పెట్టబోతున్నాడు అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక చైతు కెరీర్ లోనే ఇదో భారీ బడ్జెట్ మూవీగా ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమాపై అభిమానుల‌లోనే కాదు.. సాధారణ ఆడియన్స్‌లో కూడా మంచి హైప్ నెలకొంది. ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన బుజ్జి తల్లి సాంగ్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఇలాంటి క్రమంలో నాగచైతన్య మరో భారీ ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడంటూ సమాచారం.

Naga Chaitanya to team up with Virupaksha director?

బాహుబలి మేకర్స్ ఆర్కా మీడియాతో చైతు నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడట. ఇక‌ ఎక్కువగా ఇప్పటివరకు లవ్ స్టోరీస్ మాస్ మూవీస్, ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేశారు. కానీ.. హారర్ జోనర్‌లో ఒక్క సినిమా కూడా నటించలేదు. ఇక అమెజాన్ ఓటీటీ ప్రైమ్ కోసం.. దూత అనే సస్పెన్స్ థ్రిల్లర్ ని నటించాడు. కానీ.. అది పూర్తి హారర్ సిరీస్ కాదు. ఇక ప్రస్తుతం ఎక్కువగా హారర్ కామెడీ సినిమాలే ఆడియన్స్‌లో మెప్పిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో నాగచైతన్య హ‌ర‌ర్ జానర్‌లో భారీ బడ్జెట్ సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నాడట. ఏకంగా రూ.120 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమా చేయనున్నారని.. వచ్చే ఏడాది సినిమా గ్రాండ్ లెవెల్లో షూట్ ప్రారంభం కానుందని సమాచారం. ఇంతకీ డైరెక్ట్ ఎవరో చెప్పలేదు కదా. విరూపాఓతో బ్లాక్ బ‌స్టర్ అందించిన కార్తీక్ వర్మ.. ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించనున్నాడట.