టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వారిలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్‌లతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ ప్రొడ్యూసర్ గతంలో బాలయ్య, తారక్ సినిమాలను తెరకెక్కించి ఏకంగా రూ.14 కోట్ల లాభాలు కొల్లగొట్టాడంటూ.. అతను నిజంగానే చాలా లక్కీ అంటూ ఓ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది.
ఇంతకీ ఆ ప్రొడ్యూసర్ ఎవరు.. బాలయ్య, తారక్‌లతో ఆయన చేసిన సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. అతనె ఎవరో కాదు.. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్.. ఇక సురేష్.. బాలయ్య తో చెన్నకేశవరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్ తో ఆది సినిమాలను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఆయనకు ఏకంగా రూ.14 కోట్ల లాభాలు తెచ్చిపెట్టాయని స్వయంగా బెల్లంకొండ సురేష్ ఓ సందర్భంలో వివరించాడు. బాలయ్య, తారక్ సినిమాలతో ఈ రేంజ్ లో లాభాలు అంటే నిజంగా బెల్లంకొండ సురేష్ చాలా లక్కీ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈయన మొదటి నుంచి నందమూరి హీరోలతో ఎక్కువ సినిమాలు రూపొందించారు.
ఇక ఆ సినిమాల్లో మెజారిటీ సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఇక మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం ఆయనకు మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌లో ఒకరిగా కెరీర్ కొనసాగిస్తున్న బెల్లంకొండ సురేష్.. తన కొడుకులతో ఎక్కువగా సినిమాలు చేస్తున్నాడు.ఇక ప్రస్తుతం బాలయ్య, తారక్ ఎలాంటి ఫామ్ లో ఉన్నారో తెలిసిందే. తారక్ ఏకంగా పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్తో దూసుకుపోతుంటే.. మరోపక్క బాలయ్య తన సినిమాలతో కోట్ల లాభాలను కొల్లగొడుతున్నాడు. ఈ క్రమంలో బెల్లంకొండ సురేష్.. నందమూరి హీరోలతో సినిమాలు తీస్తే మరిన్ని సక్సెస్‌లు అందుకుని లాభాలు దక్కించుకోవడం ఖాయం అనడంలో అతిశయోక్తి లేదు.