టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో జరిగిన తొక్కేసిలాట ఘటనలో మహిళా చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే అల్లు అర్జున్‌ను చంచల్ కూడా జైలుకు తరలించి ఒక రోజంతా అక్కడే ఉంచేసారు పోలీసులు. ఇక హైకోర్టు మధ్యంతర బెయిల్ తెచ్చుకుని.. తర్వాత రోజు ఉదయం జైలు నుంచి రిలీజై ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ తో పాటు.. ఎంతోమంది సన్నిహితులు, స్నేహితులు, బంధువులు ఇంటికి వెళ్లి మరీ బన్నీని పరామర్శించారు.
అయితే జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత బన్ని ఒక్కొక్కరిని కలుస్తూ వారితో ముచ్చటించాడు. కాగా.. నిన్న ఉదయం అల్లు అర్జున్ తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి మరి.. ఆయనతో ముచ్చటించి వచ్చారు. ఇక నాన్న సాయంత్రమే నాగబాబు ఇంటికి కూడా బన్నీ వెళ్లారు. అయితే కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి.. అల్లు అర్జున్‌కు మధ్యన దూరం పెరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే బన్నీ కూడా మెగా కుటుంబం నుంచి వేరు కావాలని చూస్తున్నట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అలాగే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ తన అభిమానులను మెగా ఫ్యాన్స్ అని కాకుండా అల్లు ఆర్మీ అంటూ పిలవడం మొదలుపెట్టాడు.
దీంతో బన్నీకి.. మెగా ఫ్యామిలీలకు మధ్యన పూర్తిగా దూరం పెరిగిపోయిందని అంతా భావించారు. ఇక దీంతోపాటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఉండగానే వైసీపీ అభ్యర్థిగా ఉన్న తన స్నేహితుడి కోసం ప్రచారానికి వెళ్లడం మెగా ఫ్యాన్స్‌కు మరింత కోపం తెప్పించింది. ఇలాంటి క్రమంలో బన్నీ అరెస్ట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత.. చిరంజీవి, నాగబాబులను ఇంటికి వెళ్లి మరీ కలవడం.. మెగా ఫాన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తుంది. మిగిలింది పవన్ కళ్యాణ్ ఒక్కడే అని.. అల్లు అర్జున్ – పవన్ కళ్యాణ్ ని కూడా కలిస్తే ఇక మెగా, అల్లు ఫ్యామిలీల వార్‌కు చెక్క్ పడుతుందని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి బన్నీ ఇప్పటికైనా పవర్ స్టార్ ను కలుస్తాడా లేదా వేచి చూడాలి.