‘ గేమ్ ఛేంజర్ ‘ ఆ సీన్ లీక్.. ఒక కామెంట్ తో సినిమాపై అంచనాలను పెంచేసిన చరణ్.. !

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక చరణ్ నుంచి ఓ సోలో మూవీ వచ్చి దాదాపు మూడున్నర ఏళ్లు గడిచిపోయింది. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ మెగా ఫ్యాన్స్‌తో పాటు.. పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న చరణ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Bigg Boss Telugu Finale Promotes Ram Charan's Game Changer

తాజాగా రామ్‌చరణ్ బిగ్‌బాస్ షో సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కు స్పెషల్ గెస్ట్‌గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చరణ్ గేమ్ ఛేంజ‌ర్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇక సినిమాకు సంబంధించి ఫైనల్ లీక్ చేసిన ఓ సీన్‌ ఆడియన్స్‌లో మరిన్ని అంచనాలను పెంచేసింది. గంగవ్వ న‌న్ను గట్టిగానే తిట్టిందంటూ.. గేమ్ ఛేంజ‌ర్‌లో ఓ సీన్‌ను రామ్‌చరణ్ వివ‌రించాడు. గంగవ్వతో నాకు పరిచయం ఉందని.. సినిమాలో ఇద్దరం కలిసి నటించమని చెప్పాడు.

ఇక చరణ్ మాట్లాడుతూ.. మీ ఉద్యోగం సరిగ్గా చేయడం లేదని.. మా పేదోళ్లకు ఏమైనా చేయాలని గంగవ్వ నన్ను తిడుతుందని.. చరణ్ వెల్లడించాడు. రామ్ చరణ్ గేమ్ చేంజర్‌లో ఓ ఐఏఎస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే గంగవ్వ డైలాగ్ చరణ్ చెప్పడంతో.. సినిమాపై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంది. గేమ్ ఛేంజ‌ర్ మూవీ రిలీజ్‌కు మరో 24 రోజుల సమయం ఉంది. ఇక.. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.