శ్రీ తేజను కలవలేకపోతున్నా కారణం ఇదే.. అల్లు అర్జున్ పోస్ట్ వైరల్.. !

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నుంచి పుష్ప 2 రిలీజై భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రిలీజ్‌కు ముందురోజు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. దాన్ని చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన క్రమంలో అక్కడ తొక్కిసులాట జరిగి.. రేవతి అనే మహిళ మృతి చెందింది. దీంతో శుక్రవారం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. చంచల్గూడా జైలుకు తరలించి ఒక రాత్రంతా జైల్లోనే ఉన్న అల్లు అర్జున్.. హైకోర్టులో మధ్యంత‌ర బెయిల్ తెచ్చుకొని శనివారం ఉదయం బయటకు వచ్చాడు. ఆయనతో పాటు సంధ్య థియేటర్ యాజమాన్లు అయిన చిన్న రాంరెడ్డి, పెద్దరాంరెడ్డి లను కూడా రిలీజ్ చేశారు. శని, ఆదివారం అంతా బన్నీని పలకరించేందుకు స్నేహితులు, స్టార్ సెలబ్రిటీస్ అంతా ఆయన ఇంటికి చేరుకున్నారు.

కాగా ఈ తొక్కీసులాట ఘ‌ట‌న‌లో రేవతితోపాటు.. ఆమె కుమారుడు శ్రీ తేజకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ప్రస్తుతం శ్రీ తేజ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా బ‌న్నీ రియాక్ట్ అయ్యారు. శ్రీ తేజను.. కేసు విచారణ క్రమంలో కలవలేకపోతున్నానని వెల్లడించాడు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో గాయపడిన కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు గురించి ఆయన ఆందోళన చెందుతున్నట్లు వెల్లడించాడు. ఆ బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని.. ప్రస్తుతం అతన్ని కలవలేక పోతున్న.. వాళ్ళ ఇంటికి వెళ్లడం కుదరడం లేదు.. త్వరలోనే వారి కుటుంబాన్ని కలిసి మాట్లాడతా అంటూ వెల్లడించాడు.

వారిని ఆదుకుంటానని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాను అంటూ అల్లు అర్జున్ వెల్లడించాడు. ఇక గతంలోనే అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం ఇవ్వాలని నిర్ణయించుకుని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. చికిత్స ఖర్చులు భరిస్తారని ఫ్యామిలీకి అండగా ఉంటాన‌ని ఆయన హామీ ఇచ్చాడు. అలాగే న్యాయవాది నిరంజన్ రెడ్డితో చర్చించిన తర్వాత ఆయన మరోసారి మీడియాతో మాట్లాడాడు. నేను కుటుంబంతో సినిమా ధియేటర్లో ఉన్న టైంలో ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అది. ఉద్దేశపూర్వకంగా ఏమీ జరగలేదు. అందులో నా ప్రమేయం లేదు అని వెల్లడించాడు. వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మీడియా ప్రశ్నలకు బన్నీ రియాక్ట్ అవుతూ చట్ట పరిధిలో ఉన్న అంశాలని నేను మాట్లాడకూడదంటూ చెప్పుకొచ్చాడు.