పుష్ప 1 కు మించిన బ్లాక్బ‌స్ట‌ర్‌.. అయినా పుష్ప 2కు లాభాలు క‌ష్ట‌మేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. డైరెక్టర్ సుకుమార్ తెర‌కెక్కిచ్చిన భారీ పాన్‌ ఇండియన్ మూవీ పుష్ప 2 ది రూల్.. ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. రష్మిక మందన హీరోయిన్గా మెరిసిన ఈ సినిమాలో.. ఫాహ‌ద్ ఫాజిల్ విల‌న్ పాత్రలో కనిపించారు. సునీల్ అనసూయ కీలకపాత్రలో మెప్పించారు. ప్రస్తుతం కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న ఈ సినిమా.. ఆరు రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి.. ప్రభాస్ కల్కి 2898 ఏడి మూవీ రికార్డును బ్లాస్ట్ చేసింది. ఇక 2024లో.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హైయెస్ట్ వసూళ్లు సాధించిన సినిమా గాను పుష్ప 2 రికార్డ్ సృష్టించింది.

Pushpa: The Rise - Wikipedia

రిలీజ్ అయిన అన్ని సెంటర్స్‌లో ఇప్పటికీ కొనసాగుతున్న ఈ సినిమా.. నార్త్ లో నెవర్ బిఫోర్ అనే రేంజ్‌లో దూసుకుపోతుంది. త్వరలో ఓ క్రేజి రికార్డును కూడా క్రియేట్ చేయనుంది. ఇప్పటివరకు నార్త్ లో బాహుబలి 2.. రూ.511 కోట్ల వసూలు కొల్లగొట్టగా.. పుష్ప 2 ఆ రికార్డును ఆదివారం బ్రేక్ చేయడం ఖాయమంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. పుష్ప ఫస్ట్ పార్ట్ కూడా నార్త్ లో వేరే లెవెల్ లో సక్సెస్ అందుకుంది. మేకర్స్‌కు విపరీతమైన లాభాలు తెచ్చిపెట్టింది. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ.. హిందీ వర్షన్‌కు అప్పట్లో మేకర్స్ రూ.20 కోట్లు ఖర్చు చేయగా.. నార్త్ ఆడియన్స్ అంతా ఓ రేంజ్ లో సినిమాను ఆదరించారు.

Pushpa 2: The Rule Becomes Fastest Rs 500 Crore Indian Film, Producer Naveen Yerneni Expresses Pride | Regional News | Zee News

ఏకంగా పుష్ప 1కు 106 కోట్ల వస్తువులు వచ్చాయి. అంటే రూ.86 కోట్ల లాభాన్ని తెచ్చి పెట్టింది. అంటే దాదాపు 430 శాతం ప్రాఫిట్ మేకర్స్ కు పుష్ప 1 అందించింది. ఇదే టైంలో పుష్ప సీక్వెల్ వసూళ్ల గురించి హాట్ టాపిక్ గా న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఈ మూవీ సిక్వెల్ హిందీ వర్షన్ కోసం మేకర్స్ ఏకంగా రూ.200 కోట్లను ఖర్చు చేశారని టాక్. ఇప్పటివరకు హిందీ బెల్ట్ లో రూ.500 కోట్లు పైగా రాబట్టిన పుష్ప 2 .. 120 శాతం లాభాన్ని పొందింది. ఇది చాలా గ్రేట్ సక్సెస్. కానీ.. ఫస్ట్ పార్ట్ రేంజ్ లో లాభాలు తెచ్చుకోవడం అంటే కేవలం హిందీలోనే పుష్ప రూ.1000 కోట్ల మార్క్‌ టచ్ చేయలి. అంటే అది కష్టమే. ఈ క్రమంలోనే చివరకు పుష్ప 1 కు మించిన బ్లాక్బ‌స్ట‌ర్‌.. అయినా పుష్ప 2కు ఆ రేంజ్ లాభాలు క‌ష్ట‌మే.. ఇక ఈ మూవీ ఏ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తుందో.. వేచి చూడాలి.