టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. మెగా కోడలిగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకొని మ్యారీడ్ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఇకపై లావణ్య ఇండస్ట్రీలో కనిపించదని.. సినిమాలకు గుడ్ బై చెప్పేసిందని అంతా భావించారు. అయితే అభిప్రాయాలు అన్నిటినీ పటాపంచలు చేస్తూ లావణ్య సరికొత్త ప్రాజెక్టును మొదలుపెట్టింది. అదే సతీ లీలావతి.
తాతినేని సత్యా డైరెక్షన్లో రూపొందులున్న ఈ సినిమాకు నాగ మోహన్ బాబు, రాజేష్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారు. నేడు లావణ్య త్రిపాఠి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అఫీషియల్ గా ప్రకటించారు ప్రొడ్యూసర్స్. నానితో.. భీమిలి కబడ్డీ జట్టు, సుధీర్ బాబుతో.. ఎస్ఎంఎస్ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన సత్యా.. చాలా గ్యాప్ తర్వాత మరోసారి సతీ లీలావతి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. మీకీ .జే మేయర్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది.
అయితే ఇది రొటీన్ కథ కాదని.. భిన్నమైన అంశాల్ని స్పృశిస్తూ సాగే సినిమా అంటూ నిర్మాతలు వెల్లడించారు. లావణ్య కూడా చాలా కధల్ని విని.. ఆచితూచి ఈ కథను ఎంచుకుంది. ఈ క్రమంలోనే పెళ్లయ్యాక చేస్తున్న సినిమా కనుక మెగా అభిమానుల ఫోకస్ కూడా ఈ సినిమా పై ఉంటుందని ఆమెకు తెలుసు. దీంతో స్క్రిప్ట్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుందని.. క్యారెక్టరైజేషన్ పరంగా కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త ఇన్నింగ్స్ లో లావణ్య త్రిపాఠి కొణిదల ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.