స్వీటీ ఏంటి ఈ డేర్‌: ప్ర‌భాస్‌తో కోట్లాట‌కు అనుష్క రెడీ… ?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్కల జోడి గురించి తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ పేరుకు టాలీవుడ్‌లో స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ప్రేమాయ‌ణం నడుస్తుందంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే చాలాసార్లు వీరిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందంటూ క్లారిటీ ఇచ్చిన కూడా.. ఈ వార్తలకు మాత్రం చెక్ పడలేదు. ఇక అనుష్క.. బాహుబలి తర్వాత చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

Anushka Shetty Birthday,ప్రభాస్, అనుష్క ఒకేలా.. కొత్త పోస్టర్‌పై  రియాక్షన్స్ - anushka shetty ghati poster like prabhas raja saab - Samayam  Telugu

కాగా.. గత ఏడాది మిస్‌శెట్టి మిస్డర్ పోలిశెట్టి సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఘాటి సినిమాతో ఆడియ‌న్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. అయితే నిన్నమొన్నటి వరకు ప్రభాస్‌తో కలిసి సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ప్రభాస్‌తో పోరుకు సై అంటుంది. ప్రభాస్ నుంచి సినిమా రిలీజ్ అయిన వారానికే.. తన సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్‌ సినిమాను ఏప్రిల్ 10 కి రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

ఇది గతంలోనే మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా వచ్చిన వారానికి అంటే ఏప్రిల్ 18 కి అనుష్క నటిస్తున్న ఘాటి సినిమా రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు మూవీ టీం. ఈ మేరకు ఓ చిన్న వీడియోను రిలీజ్ చేసి ఘాటీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డైరెక్టర్ క్రిష్ సీరియస్ గా పని చేస్తుండగా.. ఫస్ట్ కాపీ ఎప్పుడు ఇస్తావ్ అంటూ నిర్మాతలు ప్రశ్నించడం.. రిలీజ్ తేదీ టాపిక్ రావడం.. వెంటనే అనుష్క ఎంట్రీ ఇచ్చి ఏప్రిల్ 18న అని చెప్తుంది. అలా గాటి రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. ఇక ఈ వీడియో ప్ర‌జెంట్ తెగ వైరల్ గా మారుతుంది.