ఎన్టీఆర్ డ్రీమ్ రోల్ అదే.. ఆ మ్యాటర్ లో తాత, మనవడు సేమ్ టు సేమ్..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరికి ఓ డ్రీమ్ రోల్‌ అనేది ఉంటుంది. తమ సినీ కెరీర్‌లో ఒక్కసారైనా ఇలాంటి పాత్రలో నటించాలనే కోరిక కచ్చితంగా ఉంటుంది. అలాంటి పాత్రలో నటించే అవకాశం వస్తే మాత్రం దానిని క‌చ్చితంగా మిస్ చేసుకోరు. ఆ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అలా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఓ డ్రీమ్ రోల్ ఉంద‌ని.. కానీ ఇప్పటివరకు తార‌క్‌ తన డ్రీమ్ రోల్ లో నటించలేకపోయాడంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ డ్రీమ్ రోల్‌ ఏంటో.. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి చూద్దాం.

Sr NTR WhatsAppstatus | SrNTR SpecialStatus #NT.RamaraoBirthday #NTR -  YouTube

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు మనవడిగా.. తారక్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బాల నటుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం తాతకు తగ్గ మనవడిగా తానేంటో నిరూపించుకుంటూ దూసుకుపోతున్నాడు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి జీవించే తారక్ త‌న న‌ట‌న‌తో కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రీసెంట్గా దేవర తో పాన్ ఇండియా లెవెల్ బ్లాక్ బస్టర్ అందుకున్న తార‌క్‌.. ప్రస్తుతం బాలీవుడ్ గ్రీక్‌వీరుడు హృతిక్ రోషన్‌తో కలిసి వార్ 2 సినిమా సెట్స్‌లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న తారక్ మాత్రం.. ఎప్పటినుంచో ఓ పాత్రలో నటించాలని ఆరాటపడుతున్నాడట.

Junior NTR spoiling the image of Senior NTR | cinejosh.com

ఇన్ని సంవత్సరాల తన కెరీర్లో ఇప్పటివరకు అలాంటి పాత్రలో నటించేందుకు సరైన అవకాశం రాలేదని సమాచారం. ఇంతకీ ఆ డ్రీమ్ రోల్ ఏంటో చెప్పలేదు కదా.. ఆయనకు కూడా తాతగారు నందమూరి తారక రామారావు లాగా.. పౌరాణిక పాత్రలో నటించాలని ఎప్పటినుంచో కోరిక ఉండేదట. ఇక సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో అద్భుతమైన.. విభిన్న‌ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అలా.. కృష్ణుడు, భీముడు, దుర్యోధనుడు, రావణుడు లాంటి పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కృష్ణుడు పాత్రలో నటించేందుకు ఎంతో ఇష్టం చూపించే వారట. ఇప్పుడు.. మనవడు తారక్ కూడా ఇదే రోల్ తన డ్రీం రోల్‌గా భావిస్తున్నాడట‌. కానీ తారక్‌కు ఇప్పటివరకు అలాంటి అవకాశం రాలేదు. గతంలో బృందావనం సినిమాలో మోడల్ కృష్ణుడిగా కనిపించినా.. పౌరాణిక పాత్రలో మాత్రం తారక్ కనిపించిందే లేదు. ఇక ఫ్యూచ‌ర్‌లో తెర‌కెక్కే రాజమౌళి డ్రీం ప్రాజెక్టు మహాభారతంలో అయినా.. ఎన్టీఆర్ కృష్ణుడు పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకొని.. తన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకుంటాడేమో వేచి చూడాలి.