సునీల్, త్రివిక్రమ్ పెళ్లిళ్ల వెనక ఎంత కథ నడిచిందా.. వింటే షాకే..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్‌.. మాట‌ల‌మంత్రికుడిగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఒకప్పటి స్టార్ కమెడియన్.. ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ న‌టుడిగా రాణిస్తున్న సునీల్‌కు పరిచయం అవసరం లేదు. ఇక‌ దాదాపు టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ సునీల్, త్రివిక్రమ్ కు మధ్యన ఉన్న మంచి స్నేహబంధం గురించి తెలిసే ఉంటుంది. చాలా సందర్భాల్లో కూడా వీళ్లిద్దరు త‌మ‌ మధ్య బాండింగ్ గురించి వెల్లడించారు. గతంలోనూ ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఎవరి పనిలో వారు బిజీగా గడుపుతున్నా.. ఇప్పటికీ వారి మధ్యన స్నేహబంధం అలాగే కొనసాగుతుంది.

Trivikram-sunil : ఫ్రెండ్షిప్ లోనే కాదు.. పెళ్లిలోనూ ఒకటే | did you know that trivikram srinivas and sunil chose to tie the knot on the same auspicious day

ఇక కెరీర్‌ త్రివిక్రమ్ చివరిగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సినిమా ఫ్లాప్ కావడంతో ఇప్పటివరకు త్రివిక్రమ్ మరో సినిమాను ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ఈయన తన నెక్స్ట్ సినిమాను అల్లు అర్జున్‌తో కన్ఫామ్ చేశాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా భారీ పాన్ ఇండియన్ మూవీ గా ఊహించని రేంజ్ లో రూపొందించనున్నాడట. ఇక బన్నీ పుష్ప 2 సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుని దూసుకుపోతున్నాడు. అలాగే త్రివిక్రమ్, బ‌న్ని కాంబోలో మూడు సినిమాలు రిలీజై ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించాయి. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో రాబోతున్న నాలుగో సినిమాపై కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో మంచి అంచనాలనుకున్నాయి.

త్రివిక్రమ్ కు తప్పలేదు..సునీల్ కోసం మళ్లీ | Sunil to turn as a comedian again for Trivikram jsp

ఇక సునీల్ కూడా ప్రస్తుతం పాన్‌ ఇండియన్ నటుడుగా మంచి ఇమేజ్ తో రాణిస్తున్నాడు. కాగా.. వీరిద్దరూ తమ స్నేహాన్ని పెళ్లి రూపంలో కూడా ప్రూవ్ చేశారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్రివిక్రమ్, సునీల్ పెళ్లి కూడా ఒకేసారి జరిగిందట. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వీరిద్దరూ వివాహం చేసుకున్నారని.. అది కూడా హైదరాబాదులోనే. 2002లో అక్టోబర్ 11న త్రివిక్రమ్ శ్రీనివాస్, సౌజన్యని వివాహం చేసుకోగా.. అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు సునీల్ శిల్పారామంలో.. శృతిని వివాహం చేసుకున్నాడు. అయితే వారిద్దరి స్నేహబంధం పెళ్లి విషయంలోనూ ఇలా మ్యాచ్ కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరి మ్యారేజ్ వెనక కూడా ఇంత కథ నడిచిందా అంటూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ న్యూస్ నెటింట‌ తెగ ట్రెండ్ అవుతుంది.