ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో పుష్ప 2 మాత్ర‌మే కొట్టిన రికార్డ్ ఇది… !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా మూవీ పుష్ప 2 రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటుంది. 3 గంటల 18 నిమిషాలు అడిగితే తెర‌కెక్కిన‌ ఈ సినిమా ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే పుష్పరాజ్‌ మేనరిజానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అలా పుష్ప 2 ఇప్పటికే భారీ రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

Pushpa 2' box office collection Day 11: Allu Arjun and Rashmika Mandanna  starrer crosses Rs 900 crore mark; beats 'RRR' to record 3rd highest  worldwide gross for Indian movie | Hindi Movie

ఏ సినిమా కలెక్షన్ల పరంగాను భారీ లాభాలను తెచ్చిపెడుతుంది. కేవలం 6 రోజుల్లోనే ఏకంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు కల్లగొట్టి రికార్డ్స్ సృష్టించిన పుష్పరాజ్.. నార్త్ ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ సినిమా కొల్లగొట్టలేని రేంజ్ లో కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పుష్పట్టు ఖాతాలో సరికొత్త రికార్డు క్రియేట్ అయింది. ఇండియన్ సినీ చరిత్రలోనే పుష్పరాజ చరిత్ర సృష్టించాడు ఇంతకీ రికార్డ్ ఏంటో ఒకసారి చూద్దాం.

Pushpa 2 Box Office Collection Day 6: छह दिन में कमाए 1000 करोड़, अल्लू  अर्जुन ने बॉक्स ऑफिस सुखा दिया सबका दम | Pushpa 2 Box Office Collection Day  6 allu arjun

పుష్ప 2 రిలీజ్ అయి ఇప్పటికే 11 రోజులు అవుతున్న క్రమంలో తాజాగా ఈ సినిమా నిన్న‌టి క‌లెక్ష‌న్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ మూవీకి నిన్న‌ రూ.104 కోట్ల కలెక్షన్లు రావ‌డం విశేషం. రిలీజ్ అయిన 11ం రోజున 100+ కోట్ల‌ కలెక్షన్లు రాబట్టిన మొట్టమొదటి భారతీయ సినిమాగా పుష్ప 2 సరికొత్త సంచలనం సృష్టించింది. ఇక ఇప్పటికే పుష్ప 2 అత్యధిక వసూళ్ళు రాబట్టిన ఇండియన్ సినిమాల్లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు దంగల్‌ మొదటి స్థానంలో నిలువగా, బాహుబలి 2 రెండో ప్లేస్ లో ఉంది. ఇక పుష్ప 2 ఫుల్ రన్ ముగిసేస‌రికి ఆ రికార్డులు కూడా బ్రేక్‌ చేసి నెం వ‌న్ స్థాన‌ని చేరుతుందేమో వేచి చూడాలి.