మంచు ఫ్యామిలీ విభాగం గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గతవారం అంత ఎక్కడ చూసిన ఈ వివాదమే చర్చినియాంశంగా ట్రెండ్ అయ్యింది. మనోజ్, మోహన్ బాబు ఇద్దరి మధ్యన తరచు వాగ్వాదం జరగడం.. పోలీసులకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో.. వివాదం రచ్చకెక్కింది. ఇక మంచు విష్ణు కూడా.. ఈ వివాదం పై తండ్రికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మోహన్ బాబు, విష్ణుకి మనోజ్ బిగ్ షాక్ ఇచ్చాడు. భార్యతో కలిసి ఆయన నేడు జనసేన పార్టీలో చేరెందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. ఈ ట్విస్ట్ మోహన్‌బాబు,విష్ణు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరంటూ పలు అభిప్రాయలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం జరుగుతున్న మంచు ఫ్యామిలీ వార్‌లో మనోజ్ బాధితుడుగా నిలవగా.. మంచు విష్ణు విలన్ గా హైలెట్ అయ్యాడు.
ఈ క్రమంలోనే రాజకీయంగా బలపడాలనే ఉద్దేశంతో.. మనోజ్, భార్య మౌనిక తో కలిసి జనసేన పార్టీలో చేరేందుకు పొలిటికల్ ఈక్వేషన్స్ సిద్ధం చేసుకున్నాడట. ఇక మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి అక్క అఖిల ప్రియాకి మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె తల్లి, తండ్రి ఇద్దరకి కూడా రాయలసీమ నుంచి మంచి పొలిటికల్ ట్రాక్ ఉంది. దీంతో మనోజ్.. తన భార్యతో కలిసి జనసేన పార్టీలో చేరడానికి చూస్తున్నడట. ఈ క్రమంలోనే రాయలసీమ పొలిటికల్ ఈక్వేషన్స్ మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.