టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుడు సినిమాలో హీరోయిన్గా నటించిన భాను శ్రీ మెహ్రా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా తర్వాత కూడా భాను శ్రీ.. పలు తెలుగు సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. దీంతో ఐదేళ్ల క్రితం కరణ్ మానస్ అనే వ్యక్తి వివాహం చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. ఇక తాజాగా.. ఈమె ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈమె సోదరుడు నందు ఎడ రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందాడు.
ఈ క్రమంలోనే అతడిని తలుచుకుని ఎమోషనల్ అయినా భాను శ్రీ.. సోషల్ మీడియా వేదికగా తన సోదరుడి జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది. నువ్వు చనిపోయి ఏడు రోజులైనా ఇంకా అది ఓ పీడకలనే అనిపిస్తుంది. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి.. నువ్వు లేకపోవడం కుటుంబంలో పెద్ద వెలితిగా మారింది. చేసే ప్రతి పనిలోనూ, చిన్న విషయంలోను నువ్వే గుర్తొస్తున్నావ్ అంటూ ఎమోషనల్‌గా వివరించింది.
నువ్వు లేవనే బాధ జీవితాంతం నేను మోయాల్సిందే అంటూ ఎమోషనల్ అయ్యిన భాను శ్రీ.. నా మనసులో ఎప్పటికీ నీకు చోటు ఉంటుంది. ఐ లవ్ యు నందు.. ఐ మిస్ యు.. అంటూ తన ఆవేదనను ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం భాను శ్రీ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతుంది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఆమెను ఓదారుస్తూ కామెంట్లు చేస్తున్నారు.