తాజాగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాలికి గాయమైనట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఆయన చెప్పుకోచారు. హను రాగవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూట్‌లో ప్రభాస్ చీలమండ దగ్గర గాయమైందని తెలుస్తుంది. ఈ కారణంగా జపాన్‌లో రిలీజ్ అయ్యే కల్కి 2898 ఏడి మూవీ ప్రమోషన్స్ కి తాను అటెండ్ కాలేకపోతున్నానని ప్రభాస్ వెల్లడించాడు. గాయం నుంచి త్వరలో కోల్కొని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటానని ఆయన చెప్పకొచ్చాడు. అయితే తాజాగా ప్రభాస్ గాయపడ్డాడని.. కల్కి జపాన్ ప్రీమియర్స్‌కు ప్రభాస్ రాలేడని తెలుసుకున్న జపాన్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
షూటింగ్ టైంలో ప్రభాస్ చీలమండకు గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించారట. ఈ మేరకు ఆయన.. జపాన్ పర్యటన రద్దు చేసుకున్నాడు. ప్రమోషన్ల కోసం విదేశానికి వెళ్లడానికి ప్రభాస్ సిద్ధం అవడం ఇదే మొదటిసారి. కానీ.. ఇది కూడా వర్కౌట్ కాలేదు. అయితే ప్రభాస్ ఈ విషయాన్ని జపనీస్ భాషలో రాసి అభిమానులతో షేర్ చేసుకోగా.. కల్కి సినిమా ట్విట్టర్ హ్యాండిల్ లో దీన్ని పోస్ట్ చేశారు. జపాన్లోని నా ప్రియమైన అభిమానులు గాయం కారణంగా ప్రీమియర్స్ కి మీతో చేరలేనందుకు క్షమించండి అంటూ ప్రభాస్ దీనిలో రాసుకోచ్చారు. మీరు సినిమాను ఆస్వాదిస్తారని భావిస్తున్నా. త్వరలో మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నా అంటూ ప్రభాస్ వెల్లడించాడు.
జనవరి 3, 2025 జపనీస్ న్యూ ఇయర్.. షో గట్స్ సందర్భంగా జపాన్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుంది. కనుక డిసెంబర్ 18న జరగాల్సిన ఈవెంట్ ఎంతో కీలకం. కాగా నాగ అశ్విన్ డైరెక్షన్‌లో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై.. ఈ సినిమాను ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కించారు. ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్తో క్రీ.శ. 2898లో భవిష్యత్ నగరమైన కాశీలో జరిగిన కథగా రూపొందించారు. ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను మైథలాజికల్ సైన్స్ ఫ్రిక్షన్ డ్రామాగా.. ఈ ఏడాది జూన్ 27న సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లు కలెక్షన్లు రాబట్టింది.