అల్లు అర్జున్ కు ఓ రూల్.. వాళ్ళకి ఓ రులా.. బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కీసులాట ఘ‌టనలో అల్లు అర్జున్ అభిమాని రేవతి మరణించడం.. ఆమె కొడుకు శ్రీ తేజ‌ పరిస్థితి విషమంగా ఉండడంతో.. ప్రస్తుతం అత‌ను చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడంతోనే.. ఈ తొక్కిసలాట జరిగిందని.. ఆయనే బాధ్యుడని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ అయినా ఒక రోజులోనే అల్లు అర్జున్ మధ్యంతర బేయిల్‌తో రిలీజ్ అయ్యారు.

కాగా బ‌న్నీ అరెస్ట్ కావడాన్ని ఎంతోమంది సినీ సెలబ్రిటీస్, పొలిటిషన్స్ కూడా తప్పుపట్టారు. ఈ క్రమంలోనే నటుడు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ విషయంపై ఆయనకు సపోర్ట్‌గా కామెంట్స్ చేశాడు. ఈ విషయంలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం మొమ్మాటికి తప్పంటూ చెప్పిన సుమన్.. హీరోని పిలిచినప్పుడు సెక్యూరిటీ బాధ్యత థియేటర్ యాజమాన్యం పైనే ఉంటుంది. క్రౌడ్ కు తగ్గట్టు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. కానీ.. ఒక యాక్టర్‌గా థియేటర్‌కు వెళ్లడం.. అల్లు అర్జున్ చేసిన‌ తప్పు కాదు.. ఈ ఘటన ఒక వార్నింగ్ లాంటిది.

అల్లు అర్జున్ కి ఒక రూల్..వారికి ఒక రూలా... బన్నీ అరెస్టుపై సుమన్ షాకింగ్  కామెంట్స్

దయచేసి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటేనే హీరోలను థియేటర్లకు పిలవండి. 12 ప్రాణం పోయింది ఆ బాధ ఎప్పటికీ తీర్చలేనిది. ఓ అభిమాని ప్రాణం పోవడం ఎంతో బాధాకరం అంటూ వెల్లడించాడు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగి ప్రాణాలు కోల్పోయారని.. వాటి గురించి ఎవరూ మాట్లాడలేదు. ఎవరు చర్యలు తీసుకోలేదు. కానీ.. అల్లు అర్జున్కి మాత్రం ఈ రూల్‌ అంటూ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం ప‌ట్లా సుమన్ మండిపడ్డారు. ప్రస్తుతం సుమన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.