పుష్ప 3 షూట్ కు ముహూర్తం ఫిక్స్.. బన్నీ లేకుండా ఆ యంగ్ హీరోతోనే 30 డేస్ షూట్..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2 ది రూల్. ఈ సినిమా సక్సెస్ జోరు ఇంకా తగ్గలేదు. సినిమా రిలీజై 11 రోజులైనా నిన్న కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇండియన్ సినిమాలోని 11వ‌ రోజు.. ఈ రోజు కలెక్షన్లు కల్లగొట్టిన ఏకైక సినిమాగా పుష్ప 2 రేర్‌ రికార్డ్ ఖాతాలో వేసుకుంది. కథలో, సినిమా క్లైమాక్స్ లో.. పార్ట్ 3 ఖచ్చితంగా ఉంటుందని ఒక చిన్న లీడ్‌ సన్నివేశాన్ని వదులుతూ డైరెక్టర్ సుకుమార్ పుష్ప 3 పై హింట్ ఇచ్చారు. పుష్ప అన్నయ్య, కుటుంబంతో కలిసి శుభమా అని సంతోషంగా కూతురి పెళ్లి చేస్తుంటే.. బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లు చూపించారు. ఓ వ్యక్తి బాంబ్ బ్లాస్ట్ చేసినట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అనేదానిపై ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది.

Pushpa 3 Vijay Deverakonda Cast Speculation: is Pushpa 3 being Considered  by Makers? Why is Vijay Deverakonda's Name Doing Rounds?

కేవలం ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాక్ సైడ్ షార్ట్ మాత్రమే చూపిస్తూ.. వ్యక్తి ఎవరనేదాన్ని హైడ్‌ చేస్తూ సుకుమార్ పుష్ప 3 అనౌన్స్ చేశాడు. ఇంతకీ బాంబ్ బ్లాస్ట్ చేసినా ఆ వ్యక్తి ఎవరు.. పుష్పకి ప్రధాన శత్రువు షీకావ‌త్‌. కానీ అత‌నైతే కచ్చితంగా కానేకాదు. ఎందుకంటే అతని నెత్తి మీద జుట్టు కూడా ఉంది. ఈ క్రమంలోనే నెటింట‌ వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆ బాంబ్ బ్లాస్ట్ చేసిన వ్యక్తి విజయ్ దేవరకొండ అని.. పార్ట్ 3లో ఆయన అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నాడు అంటూ సమాచారం. అసలు పార్ట్ 3 నిజంగానే ఉందా.. అనే అనుమానానికి సుకుమార్ చెక్ పెట్టాడు. ఇదే విషయాన్ని మేకర్స్ కూడా పుష్ప 2 సక్సెస్ మీట్‌లో వెల్లడించారు. అయితే ఈ సినిమా ఇప్పట్లో ఉండదు. 2026 నుంచి ఏమైనా ప్రారంభమవుతుందేమోనని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడిచింది.

pushpa 2 climax లో ఉండేదెవరు 💣💣 | Allu Arjun | Vijay devarakonda |  #shorts #trending #alluarjun - YouTube

ఇక బన్నీ, త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాపై ఫోకస్ చేస్తున్నాడని.. జనవరి నుంచి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉందంటూ వార్తలు వినిపించాయి. అదేవిధంగా.. ఆయన అట్లీతో సినిమా, సందీప్ వంగ‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే.. సందీప్ రెడ్డి వంగతో చేయబోయే సినిమాని ముందుగా ఆయన ప్రారంభిస్తాడని సమాచారం. కాగా పుష్ప 3 సెట్స్‌లోకి బన్నీ అడుగుపెట్టక ముందే.. అంటే వ‌చ్చే ఏడాది(2025) చివ‌రిలో విజయ్ దేవరకొండతో తీయాల్సిన సోలో సన్నివేశాలన్నీ ముందే తీసేస్తారని.. తర్వాత తీరికగా బన్నీ, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వచ్చేసి సీన్స్‌ను రూపొందిస్తారని సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. ఒకవేళ ఇదే కాంబినేషన్ పుష్ప 3లో వస్తే మాత్రం పుష్ప 2 రికార్డులను మొదటి వారంలోనే ఈ మూవీ బ్రేక్ చేస్తుందంటూ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. నిన్నటితో రూ.1400 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన ఈ మూవీ త్వరలోనే రూ.2000 కోట్ల మార్క్‌ టచ్ చేసే దిశగా అడుగులు వేస్తుంది.