అల్లు అర్జున్ కేసులో నయా ట్విస్ట్.. బెయిల్ రద్దు..!

సంధ్య థియేటర్ తొక్కీసులాట ఇష్యూలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌ను తప్పు పడుతూ.. ఎంతో మంది స్టార్ హీరోస్, రాజకీయ నాయకులు.. ఈ ఆరెస్ట్‌ను ఖండిస్తూ కామెంట్లు చేశారు. ఇక‌ మధ్యస్థ బెయిల్‌పై రిలీజ్ అయిన అల్లు అర్జున్‌నీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు మ‌రోసారి సిద్ధం అవుతున్నారని.. ఈ కేసుకు సంభందించిన సంచలన ఆధారాలు బయటపెట్టారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేసి.. మరోసారి అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా.. హీరో, హీరోయిన్ వస్తున్నారని థియేటర్ యాజమాన్యం పోలీసుల అనుమతి కోరగా.. హీరో, హీరోయిన్ వస్తే క్రౌడ్ విపరీతంగా ఉంటుంది. వాళ్లను రావద్దని చెప్పాలంటూ థియేటర్ యాజమాన్యానికి పోలీసులు రివర్స్ లేక రాసి పంపారట. కానీ.. యాజమాన్యం దానిని పట్టించుకోలేదని సమాచారం. పోలీసులు మాట వినకుండా ర్యాలీకి అల్లు అర్జున్ రావడంతో.. తొక్కీసులాట జరిగిందని.. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాదు.. శ్రీ తేజ ప్రాణాలతో పోరాడుతున్నట్లు పోలీసులు వివరించారు.

Tragedy Strikes at Sandhya Theatre During Allu Arjun's Pushpa-2 Premiere

ఈ క్రమంలోనే.. అల్లు అర్జున్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు సంధ్య థియేటర్ తొక్కిసులాటలో గాయపడిన బాలుడు శ్రీ తేజ‌ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ప్రస్తుతం బాలుడు హాస్పిటల్ లో వెంటిలేటర్ సహాయంతో శ్వాస తీసుకుంటున్నాడు. శ్రీ తేజకు పీడియాట్రిక్ ఐసీయూలో చికిత్స అందుతుందట. తొక్కీసులాటలో గాయపడిన శ్రీ తేజ.. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 11 రోజులు చికిత్స తీసుకుంటూనే ఉన్నాడని.. అతని ఆరోగ్యం పై కుటుంబ సభ్యులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.