టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు కొమరం భీంపై ఎన్నో సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే వాటి ఇంపాక్ట్ మాత్రం పెద్దగా ఆడియన్స్‌లో కనిపించలేదు. కానీ.. రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్‌తో మాత్రం అల్లూరి, కొమరం భీమ్ పాత్రలు ఫిక్షనల్ స్టోరీగా వచ్చి.. వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో జీవించేసిన సంగతి తెలిసిందే. తన అద్భుత నటనతో లక్షలాదిమంది ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక చాలా కాలం కిందట టాలీవుడ్ లో కొమరం భీం కథను నటింపజేయాలని ఎంతోమంది హీరోలకు ప్రపోజల్స్ వచ్చాయట.
వారిలో బాలకృష్ణ కూడా ఒకరు. కాగా గతంలో డైరెక్టర్ దాసరి నారాయణరావు – బాలయ్య కాంబోలో పరమవీరచక్ర సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా అప్పట్లో ఎంతో ఘనంగా జరిపారు. లెజెండ్రీ డైరెక్టర్ బాలచందర్ ముఖ్యఅతిథిగా హాజరైన ఈ ఈవెంట్‌లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాల్గొని సందడి చేశారు. ఇక ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్.. బాలయ్య గురించి మాట్లాడుతూ.. బాబాయ్ నీ ఈ సినిమాలో దాసరి నారాయణరావు గారు రావణాసురుడి గెటప్ లో చూపించారు. అలా ఆయనను చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదు. దేవుడు 10 కళ్ళు ఇచ్చుంటే ఎంత బాగుండేదో అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు.
అలాగే కొమరం భీమ్ పాత్రలో బాబాయ్‌ని చూడగానే అర్జెంటుగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో కొమరం భీమ్ టైటిల్ తో ఫుల్ మూవీ వస్తే బాగుండని కోరుకున్నా. ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో తెలియదు.. బాబాయ్ కొమరం భీమ్ సినిమాలో నటిస్తే మాత్రం అది కన్నుల పండగలా ఉంటుంది. ఆ కోరిక త్వరగా తీరాలని దేవుని కోరుకుంటున్నా అంటూ ఎన్టీఆర్ కామెంట్ చేశారు. అయితే ఎన్టీఆర్ కల ఇప్పటికీ నెరవేరలేదు. కానీ.. బాలయ్యను రిక్వెస్ట్ చేసిన అదే రోల్ లో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పూర్తి స్థాయిలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆర్ఆర్ లో కొమరం భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ తన నటనతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరో ఇమేజ్ను దక్కించుకున్నారు.