టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్.. ఇలా ప్రతి విషయంలోను ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న తారక్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక చివరిగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన దేవరలో నటించి మెప్పించిన తారక్.. మొదట ఈ సినిమాతో నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఫుల్ రన్ ముగిసే సరికి రూ.550 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.
నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్.. అతి తక్కువ సమయంలోనే తాతకు తగ్గ మనవడిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదగడానికి ఎన్నో కష్టాలు పడిన తారక్.. చిన్నతనం నుంచి హైపర్ యాక్టివ్. చాలా అల్లరి చేసేవాడట. కానీ తల్లి షాలిని తారక్‌ను ఎంత క్రమశిక్షణతో పెంచడమే కాదు.. తన లైఫ్ కు సరైన అవుట్ ఫుట్ రావడానికి కూడా కారణం అయ్యిందంటూ.. ఎన్నో సార్లు ఎన్టీఆర్ బహిరంగంగా వివరించారు. పెద్దల అతి గారాబంతో.. తారక్ కెరీర్ గాడి తప్పుతుందేమో అని భయంతో అమ్మే ఎన్టీఆర్‌ను చాలా క్రమశిక్షణలో ఉంచేదట.
ఇక తారక్ హైదరాబాద్లోని విద్యారణ్య హైస్కూల్లో తన ప్రైమరీ స్టడీస్ ను పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ లో చేరే టైంకి.. హైదరాబాదులో అతన్ని అల్లరి మరింత ఎక్కువ కావడంతో హరికృష్ణ, శాలిని దంపతులు బాగా ఆలోచించి గుంటూరు విజ్ఞాన్ కాలేజ్ హాస్టల్ లో తారక్‌ను చేర్పించారట. కానీ.. ఎన్టీఆర్ మనసంతా హైదరాబాద్ చుట్టూనే తిరుగుతూ ఉండేదట. హైదరాబాదులో ఉన్న తన ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి అక్కడ ఎంతో టఫ్ కండిషన్స్ మధ్యలో ఉన్న వడ్లమూడి విజ్ఞాన్ కాలేజ్ లో చదవడం అంటే ఎన్టీఆర్‌కు అస్సలు ఇష్టం లేదట. ఇక అక్కడి నుంచి తప్పించుకునే మార్గం లేక ఏకంగా తారక్ తన కాలు విరగొట్టేసుకున్నాడట.
అలాగైన హైదరాబాద్ తీసుకెళ్తారని ఆయన భావించాడట. కానీ.. హరికృష్ణ మరింత కఠినంగా ఉండటంతో తారక్ ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఇంటర్ మొదటి సంవత్సరం వరకు విజ్ఞాన్ లోనే చదువుకున్న తారక్.. తర్వాత హైదరాబాద్ సెయింట్ మేరీ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరాన్ని పూర్తి చేశాడు. తర్వాత చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి నటనరంగంలోకి అడుగు పెట్టాడు. చిన్నతనం నుంచే నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో హీరోగా రాణించాలన ఆశతో తారక్ దానికోసం బాల్యం నుంచే కూచిపూడి నాట్యం పై పట్టు తెచ్చుకున్నాడు. అందులో తన ప్రతిభను కనబరిచి ఎంతో మంది ప్రశంసలు కూడా దక్కించుకున్నాడు. ఇదే తన సినీ కెరీర్‌కు కూడా ప్లస్ అయిందని చాలాసార్లు చెప్పుకొచ్చాడు.