సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న చాలామంది తమ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేయకముందే ఇండస్ట్రీ పై ఉన్న ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటుకుంటున్నారు. అయితే మరి కొంత మంది మాత్రం తమ ఉన్నత చదువులను కూడా పూర్తి చేసిన తర్వాత సినిమాల్లోకి అడుగు పెడతున్నారు. ఇక నటవారసత్వంతో చదువును పూర్తి చేయకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు ఉన్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కోవకే చెందుతాడు. అయితే తెలుగులో అక్షరం ముక్క కూడా రాయడం రాని మహేష్ మహేష్ బాబు క్వాలిఫికేషన్ ఏంటి.. ఆయన ఎంతవరకు చదువుకున్నారో ఒకసారి చూద్దాం.
మహేష్ తన చదువంత చెనైలోనే పూర్తి చేశాడు. మహేష్.. చెన్నైలో ఆన్సర్ డిగ్రీ ఆఫ్ కామర్స్ పూర్తి చేసుకునే సమయంలో కూడా అసలు తెలుగు ఉండేది కాదట. సెకండ్ లాంగ్వేజ్ గా కూడా తెలుగు కాకుండా మరో భాషను ఎంచుకొని డిగ్రీ పూర్తి చేశాడని సమాచారం. తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ కు తెలుగులో చదవడం, రాయడం అసలు రాకున్న అనర్గంగా తెలుగులో మాట్లాడతాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటించి టాలీవుడ్ టాప్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న మహేష్.. విపరీతమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తర్వాత హీరోగా మారీ మంచి సక్సస్ అందుకున్నాడు.
ప్రస్తుతం రాజమౌళితో పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలో నటించే స్టేజ్ కు మహేష్ బాబు ఎదిగారు. ఇక నటనతో పాటే.. మరో పక్కన బిజినెస్ రంగంలోనూ రాణిస్తూ కోట్లు కూడా పెడుతున్నాడు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఆస్తులు విలువ కూడా వేలకోట్లలో ఉంటుందని సమాచారం. నటన పరంగా బిజినెస్ పరంగానే కాదు.. మానవత్వంలోనూ తనకు సాటి ఎవ్వరూ లేరని నిరూపించుకున్నాడు మహేష్ బాబు. ఏపీ తెలంగాణలో రెండు గ్రామాలను ఆయన దత్తత తీసుకొని ఎంతోమంది ప్రజలకు సేవ చేస్తూ అండగా నిలిచాడు. ఇప్పటికే ఎంతోమంది చిన్నపిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేపించి వారికి ప్రాణదాత అయ్యాడు.