మరి కొద్ది రోజుల్లో థియేటర్లో రిలీజ్ కానున్న పుష్ప ది రూల్ సినిమాపై ఆడియన్స్‌లో భీబత్సమైన అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాల్లో ఒకటిగా పుష్పా 2 నిలుస్తుందని అభిమానుల్లో ఆశాభావాలు మొదలయ్యాయి. అయితే పుష్పది రూల్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. ఇక బన్నీ ఈ విషయాన్ని స్వయంగా షేర్ చేసుకున్నాడు. ఓ ఈవెంట్‌లో బన్నీ మాట్లాడుతూ.. పుష్ప 2 మూవీ.. ప్రతి సీన్‌ను తను ఎంత కష్టపడి చేశాను అంటూ వెల్లడించాడు.
లేడీ గెటప్ ప్లే చేసిన టైంలో ఎంతో ఇష్టపడి నటించాను.. అంతే కష్టపడ్డానంటు చెప్పుకొచ్చాడు. ఇక ఆ పాత్ర కోసం ఎంతో పెయిన్ అనుభవించానని.. కేవలం మేకప్ కి రెండున్నర గంటలు టైం పట్టేదంటూ చెప్పుకొచ్చాడు. చూడడానికి చాలా ఈజీగా అనిపించింది. కానీ.. అది ఎంతో చాలెంజింగ్ గా ఉంది అంటూ బన్నీ వివరించాడు. ఇక ఇప్పటివరకు నేను నటించిన అన్ని సీన్స్ లో చాలా కష్టమైన ఎపిసోడ్ లేడీ గెటప్ అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. ఆ గెటప్ మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందిగా అనిపించిందని వివరించాడు.
ఓ దశలో వెన్నునొప్పి కూడా వచ్చేసింది అంటూ.. మధ్యలో షూట్ ఆపించేసినట్లు వెల్లడించాడు. పుష్ప సీక్వెల్లో జాతర ఫుల్ మాస్ లెవెల్లో చూస్తారంటూ బన్నీ చెప్పకొచ్చాడు. ఇక సినిమా వేయికోట్ల బిజినెస్ కామెంట్లపై కూడా బన్నీ రియాక్ట్ అవుతూ.. ఇప్పటివరకు ఏ సినిమా చేయని స్థాయిలో పుష్ప ది రూల్ బిజినెస్ చేయడం మాత్రం నిజం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే పుష్ప 2 కలెక్షన్స్ పరంగా అదరగొట్టడం ఖాయం అంటూ.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు బన్నీ రెమ్యునరేషన్ కూడా భారీ లెవెల్ లోనే ఉందని టాక్.