నార్మల్‌గా సీడెడ్ ఏరియాలో మాస్ సినిమాలుకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే. మాస్ సినిమా సీడెడ్ లో రిలీజ్ అయింది అంటే చాలు.. కచ్చితంగా అది మంచి కలెక్షన్‌లు కొలగొడుతుందది అనటంలో అతిశయోక్తి లేదు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలావరకు మాస్ సినిమాలో నటించి.. బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీడెడ్‌లో తారక్‌కు తిరుగులేని ఇమేజ్ క్రియేట్ అయింది. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలలో ఏకంగా 8 సినిమాలు అక్కడ డే 1 కలెక్షన్లతో రికార్డులను సృష్టించాయి.
ఇక రామ్ చరణ్, ప్రభాస్ కంటే కూడా తిరుగులేని క్రేజ్ అక్కడ తారక్ సొంతం. రామ్ చరణ్ కు 4 సినిమాలతో సక్సెస్, ప్రభాస్ కు 3 సినిమాలతో సక్సెస్ రాగా.. ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తను నటించిన దాదాపు అన్ని సినిమాతోను మంచి కలెక్షన్లను రాబట్టాడు. ఈ విషయంలో తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సీరియల్‌లో ఏకంగా రూ.30 కోట్ల కలెక్షన్లను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు చిరంజీవి నుంచి కేవలం ఒక్క సినిమా, పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క సినిమా మాత్రమే ఇక్కడ ఈ రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఆ తర్వాత వీరిద్దరి రికార్డులను కూడా బ్రేక్ చేస్తూ సిడెడ్ డే 1 కలెక్షన్లతో తారక్ సంచలనం సృష్టించాడు.
సీడెడ్ కింగ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ ఏరియాలో మొదటి నుంచి కొన్ని లిమిటెడ్ సినిమాలు మాత్రమే మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఇక క్లాస్ సినిమాలకు ఇక్కడ అసలు ఊహించిన సక్సెస్ రాదు. కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్ సినిమాలు కూడా సీడెడ్ ను నెక్స్ట్ లెవెల్ లో ఆకట్టుకుంటాయని.. నందమూరి అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా, సినిమాకు లుక్స్ లో వేరియేషన్స్ చూపిస్తూ.. మాస్ యాక్షన్ తో, డ్యాన్స్ స్టెప్స్ తో ఆదరగొడుతున్నాడు.