టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు తిరుగులేని స్టార్‌స్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వీళ్ళిద్దరు మంచి స్నేహితులు కూడా. కాగా అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాలను ఇతర స్టార్ హీరోస్ నటించి బ్లాక్ బస్టర్లు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కృష్ణ ఏది చెప్తే నిర్మాతలు కూడా అప్పట్లో అదే వినేవారు. ఆయన నిర్మాతలు బాగోగులు ఆలోచించి నిర్ణయం తీసుకునే హీరో అని వాళనమ్మకం. అలా సినిమా ఫ్లాప్ అయితే కృష్ణ తన రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే ఓ సినిమా విషయంలో కృష్ణకి నిర్మాత వడ్డే రమేష్ కి మధ్యన విభేదాలు తలెత్తయట. దాసరి నారాయణరావు డైరెక్షన్లో.. కృష్ణ హీరోగా ఓ సినిమాను ప్రారంభించారు. దానికి వడ్డే రమేష్ నిర్మాతగా ఫిక్స్ అయ్యారు. రెండు, మూడు రోజుల్లో షూటింగ్ ప్రారంభమవుతుంది అనగా.. డేట్స్‌ని మరో నిర్మాతకి కూడా అడ్జస్ట్ చేయాలని కృష్ణా.. రమేష్ ని అడిగారట. అప్పట్లో కృష్ణ ఒకేసారి మల్టిపుల్ ఫిలిమ్స్ లో నటించేవాడు. డేట్స్ మరొకరికి ఇవ్వడం కుదరదని నిర్మాత వడ్డె రమేష్ కరాకండిగా చెప్పేయడంతో కృష్ణ రేపు షూటింగ్ మొదలవుతుందనగా ఈ సినిమా నేను చేయనని సినిమా నుంచి తప్పుకున్నారట.
దీంతో చేసేదిలేక నిర్మాత, దాసరి ఇద్దరు కలిసి అదే సినిమాను కృష్ణంరాజుకి వినిపించి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత కృష్ణంరాజు హీరోగా సినిమా సెట్స్ పైకి వచ్చింది. అదే కటకటాల రుద్రయ్య. కృష్ణంరాజు కెరీర్ యూ టర్న్ తిప్పిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. కృష్ణ ఈ సినిమాలో నటించి ఉంటే ఎలా ఉండేదో కానీ.. కృష్ణంరాజు బాడీ లాంగ్వేజ్ కి ఇది 100% సెట్ అయిపోయింది. జయసుధ, జయచిత్ర హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రూ.16 లక్షలు బడ్జెట్ తో వచ్చి ఏకంగా రూ.65 లక్షల పైగా వసూలు కొలగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. కృష్ణంరాజు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా స్థానాన్ని సంపాదించుకుంది.