సౌత్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల.. ఈ పేరు నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో చాలామందికి తెలిసి ఉండదు. అయితే అక్కినేని ఇంటి కాబోయే కోడలుగా అమ్మడు ఒక్కసారిగా తెగ వైరల్ గా మారిపోయింది. సమంతతో విడాకుల తర్వాత.. నాగచైతన్య కు శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ జరగటంతో.. ఒక్కసారిగా అమ్మడు హైలైట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అమ్మడి పేరు మారుమ్రోగిపోతుంది. ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ ఫ్యామిలీ కోడలిగా మారుతున్న క్రమంలో శోభిత క్రేజ్ టాలీవుడ్‌లో బాగా పెరిగింది.
శోభిత త్వరలోనే నాగచైతన్య తో ఏడడుగులు వేయబోతుంది. ఇక ఈ ఏడది డిసెంబర్ 4న వీళ పెళ్లి గ్రాండ్ లెవెల్ లో అన్నపూర్ణ స్టూడియోస్లో జరగనుంది. ఇప్పటికే వీరికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు కూడా నెటింట తెగ వైరల్‌గా మారింది. రీసెంట్గా నాగార్జున ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించాడు. అంతేకాదు ఈ పెళ్ళి చాలా సింపుల్ గా కేవలం 300 మంది బంధుమిత్రుల సమక్షంలోనే చేసుకుంటున్నారు అంటూ నాగార్జున వెల్లడించాడు. శోభిత, చైతు ఈ పెళ్లి ని ఇలాగే సింపుల్ గా చేసుకోవాలని అనుకున్నారని వివరించాడు.
ఇలాంటి క్రమంలోని శోభితకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్ ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం వైరల్‌గా మారింది. ఆమెకు కాబోయే భర్త నాగచైతన్య కంటే.. మరో హీరో అంటేనే ఎక్కువ ఇష్టమట. ఈ విషయాన్ని గతంలో ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ్ల వివరించింది. బాలీవుడ్లో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. హిందీలో షారుక్ ఖాన్ అంటే తనకు ఫేవరెట్ అని.. ఇక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో అంటూ శోభిత ధూళిపాళ్ల చెప్పుకొచ్చింది. ఆయన యాక్టింగ్ స్టైల్, డ్యాన్స్ ఇలా ప్రతి విషయం కూడా ఆమెను ఇంప్రెస్ చేస్తుందంటూ శోభిత వివరించింది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది.