అక్కినేని నాగార్జున ఎదుట.. ఇప్పటికే నాన్న.. ఏఎన్నార్ బయోపిక్ టాపిక్ ఎన్నోసార్లు వచ్చింది. మరోసారి ఇదే టాపిక్ పై ఇఫి వేదికగా ప్రస్తావించడంతో నాగార్జున దీనిపై రియాక్ట్ అయ్యారు. తాజాగా సెంటినరీ స్పెషల్ ఏఎన్ఆర్.. సెలబ్రేటింగ్ ది లైఫ్ అండ్ బాక్స్అండ్ వర్క్స్ అఫ్ అక్కినేని నాగేశ్వరరావు.. పేరుతో గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఏఎన్ఆర్ బయోపిక్ గురించి టాపిక్ రాగా.. నాగార్జున రియాక్టర్ అవుతూ.. ఏఎన్ఆర్ బయోపిక్ గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయని.. సినిమాగా కంటే ఆయన లైఫ్ ఓ డాక్యుమెంటరీగా తీస్తే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు.
ఎందుకంటే ఆయన లైఫ్ సినిమాగా రూపొందించాలంటే అది చాలా కష్టమైన పని. జీవితంలో ఎప్పుడు వెనకడుగు వేయని ఆయన.. చివరి వరకు కూడా ఎదగడమే కానీ ఎప్పుడు పడిపోలేదు. అలాంటి అయినా లైఫ్ బయోపిక్ తీయాలంటే చూసేవారికి బోర్ కొడుతుందేమో.. కొన్ని ఒడిదుడు కుడా చూపిస్తేనే కదా సినిమా బాగుంటుంది.. అందుకే ఆయన లైఫ్ స్టోరీలో కొన్ని కల్పితాలు జోడించే డాక్యుమెంటరీగా రూపొందించాల్సి ఉంటుందంటూ నాగార్జున వెల్లడించారు.
ఇక నాగార్జున నటిస్తున్న సినిమాల గురించి మాట్లాడుతూ.. కుబేర, కూలి సినిమాల్లో షూట్ జరుగుతుందని చెప్పుకొచ్చాడు. ఇక కూలి మూవీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పై నాగార్జున ప్రసంచాల వర్షం కురిపించాడు. లోకేష్ ఈ జనరేషన్‌కు తగ్గ కథలని తెరకెక్కించడంలో దిట్ట.. అతని ఫిలిం మేకింగ్‌లో ఒక సరికొత్త స్టైల్ ఉంటుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కుబేర, కూలీ రెండు వైవిధ్యమైన సినిమాలని.. ప్రస్తుతం తన పాత్రల విషయంలో ప్రయోగాలు చేస్తున్నట్లు నాగార్జున వెల్లడించాడు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.