నందమూరి నటసింహం బాలయ్య తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. బాబి కొల్లి డైరెక్షన్లో.. నాగదేవర సూర్యవంశీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. టైటిల్, టీజర్ తాజాగా రిలీజై మంచి రెస్పాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరి డాకు మహారాజ్.. అని సెర్చింగులు ఎక్కువయ్యాయి. ఇంతకీ ఈ డాకు మహారాజ్ ఎవరో ఒకసారి చూద్దాం. డాకు మాన్ సింగ్.. 1980లో ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేరా రాథోడ్ గ్రామంలో క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. చంబాలే ఏరియాలో పెరిగిన మాన్సింగ్.. 17 మంది సహచరులతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని దోపిడీలకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే అనుచరులను కూడా పెంచుకుంటూ పోయిన మాన్ సింగ్.. పరోక్షంగా, ప్రత్యక్షంగా 400 మందికి పైగా అనుచరులతో కలిసి పని చేశాడట.
అతనిపై 125 హత్య కేసులు, 1,112 దోపిడీ కేసులు ఉండడమే కాదు. లెక్కలేనన్ని కిడ్నాప్ కేసులు కూడా ఉన్నాయి. అంతేకాదు 32 మంది పోలీసులను చంపిన నేరేస్తడుగాను ఆయనకు ఇమేజ్ ఉంది. నాలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది పోలీసులు.. 15 సంవత్సరాలు పాటు అతని కోసం ఎంతగానో గాలించినా ఆయన పట్టు పడలేదు. అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అతను రాజ్యం లేని రాజు. కొన్ని వేల మంది అతని దేవుడిలా కొలిచారు. ఇప్పటికీ కొలుస్తున్నారు. మన్ సింగ్ చిన్నప్పటినుంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉండేవాడట. పెద్దయ్యక ఊర్లో చిన్న చిన్న పంచాయతీలు తీర్పులను కూడా చేసేవాడని.. అతని ఎదుగుదల అక్కడ కొందరు రౌడీలు, వడ్డీ వ్యాపారాలు ఓర్చలేకపోయారని.. దీంతో అతనిపై కోపంతో కుట్రలు చేయడం ప్రారంభించారని సమాచారం.
ఈ క్రమంలోనే అతని భూమి అన్యాయంగా లాక్కొని.. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించేశారు. జైల్లో నుంచి రిలీజ్ అయిన మాన్ సింగ్.. కోపంతో తను జైలుకు వెళ్లడానికి కారణమైన వాళ్ళ పై దాడి చేశాడు. వాళ్ళ ఇళ్లకు నిప్పంటి చంబల్ లోయల్లోకి పారిపోయాడు. కానీ.. కొన్నాళ్లకు అక్కడ నుంచి తిరిగి ఊరికి వచ్చి.. పోలీసులకు దొరికిపోయాడు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం మాన్ సింగ్‌ను మళ్ళీ జైలు శిక్ష విధించింది. జైల్లో ఉన్నప్పుడే మాన్సింగ్ ఇద్దరు కొడుకులు జస్వంత్, ధన్వర్ సింగ్‌లను ఎన్కౌంటర్‌లో చంపేశారు. 1939లో జైలు నుంచి రిలీజై.. కొత్త సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. కొడుకులని చంపిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఇక ఆయన దోపిడీలు చేసిన మాట కూడా వాస్తవమే. కానీ.. ఆ దోపిడి డబ్బు అంతా పేదల కడుపు నింపడానికే.. ధనికుల ఇల్లు దోచి.. పేదల జేబులు నింపేవాడు. ఆడవాళ్ళను గౌరవించేవాడు. ఎంతోమంది అమ్మాయిల పెళ్లిళ్లు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఆగ్రా చుట్టుపక్కల జిల్లాల్లో మాన్ సింగ్ దేవుడయ్యాడు. అతనికి గుడి కట్టి పూజలు కూడా చేశారు. ఆ ఆలయం ఇప్పటికీ ఉంది. ఇక ఓ సందర్భంలో అమితాబ్ బచ్చన్ కూడా డాకు సింగ్ గురించి వెల్లడించాడు.