చరణ్ ‘ గేమ్ ఛేంజర్ ‘ ఫస్ట్ రివ్యూ.. బొమ్మ బ్లాక్ బాస్టరేనా.. ?

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించిన తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌.టాలెంటెడ్ డైరెక్టర్ శంక‌ర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత చాలా గ్యాప్‌తో చరణ్ నుంచి వస్తున్న మొదటి సోలో సినిమా కావడంతో.. ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ.. శంకర్.. భారతీయుడు 2 షూట్‌లో బిజీగా ఉండి గేమ్ ఛేంజ‌ర్‌ హోల్డ్‌లో పెట్టారు.

Gamechanger: SJ Suryah Turns Mopidevi For The Shankar's Directorial & Ram  Charan Starrer

అయితే తాజాగా రిలీజ్ అయిన భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో.. గేమ్ ఛేంజర్ ఎలా తీసి ఉంటాడో.. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. అనే సందేహం అభిమానుల్లో మొదలైంది. అయితే తాజాగా సినిమాలో కీ రోల్‌లో నటించిన సూర్య.. తన పాత్ర డబ్బింగ్ గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో అన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని.. ప్రతి సీన్‌ అద్భుతంగా వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని.. ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడం ఖాయం అంటూ వెల్లడించాడు. ఇక సూర్య చెప్పిన దాని ప్రకారం సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రియల్ హిట్ పక్కా అని.. చరణ్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan : 'గేమ్ ఛేంజర్' పవన్ కళ్యాణ్‌తో తీద్దామన్నారు శంకర్.. దిల్  రాజుని ట్రోల్ చేస్తున్న పవన్ అభిమానులు.. | Shankar wants to make game  changer with pawan kalyan but ...

సోషల్ మీడియాలో ఈ వార్తలు తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే ఏపీ రాజధాని అమరావతిలో కూడా ఈవెంట్ చేయనున్నారట మేకర్స్. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా రానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ స్కెడ్యూల్ తో రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ప‌వ‌న్ ఫ్రీ టైం బట్టి యూనిట్ ఈవెంట్ ను ప్లాన్ చేయనున్నారట. ఏపీలో ఈ సినిమా టికెట్ ధరల విషయంలోనూ అనుమతి తీసుకునే అవకాశం ఉందని.. తెలుస్తుంది. ఇక‌ 2025 సంక్రాంతి బరిలో చెర్రీ బ్లాక్ బ‌స్టర్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.