కెరీర్ స్టార్టింగ్‌లోనే తారక్‌ను అష్టకష్టాలు పెట్టిన డైరెక్టర్ తెలుసా.. అంత టార్చరా..!

ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల పరంగా ఓ రేంజ్‌లో సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి.. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బ‌స్టర్ సినిమాలో నటించి మెప్పించిన తార‌క్ త‌న‌ నటన, అందం, డ్యాన్స్, డైలాగ్ డెలివరీ.. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు కూడా తారక్‌తో నటించాలని ఆరాటపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో తారక్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైర‌ల్ అవుతుంది. తార‌క్‌ను కెరీర్ స్టార్టింగ్‌లో ఓ డైరెక్టర్ చాలా కాలం పాటు టార్చ‌ర్ చేశాడ‌ట‌.

Jr NTR's Simhadri- Rajamouli's family watch the re-release amidst packed  crowds in a single screen

ఆ డైరెక్టర్ ఎవరు.. ఏ విధంగా ఆయన వల్ల తార‌క్‌కు బ‌చ్చిన క‌ష్టాలెంటో ఒకసారి చూద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దర్శకధీరుడు రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్‌ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతో తార‌క్‌కు మొట్టమొదటి బ్లాక్ బస్టర్ దక్కింది. తర్వాత వీరిద్ద‌రి సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమా కూడా అదిరిపోయే రేంజ్ లో సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తారక్‌కు.. తర్వాత వరుస ప్లాప్‌లు ఎదురయ్యాయి.

Simhadri

చాలా సంవత్సరాల పాటు తారక్ ఎంత శ్రమించినా కూడా.. ఒక్క సినిమా కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో సింహాద్రి తర్వాత తారక్ కెరీర్ ముగిసిందని చాలామంది భావించారు. అయితే ఒకానోక‌ ఇంటర్వ్యూలో భాగంగా.. రాజమౌళి కూడా సింహాద్రి సినిమా తర్వాత చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నన‌ని.. ఆయన కెరీర్ కొన్ని సంవత్సరాలు పాటు.. ఫుల్ డల్ గా మూవ్ అయిందంటూ వివరించాడు. అలా తారక్ కెరీర్ స్టార్టింగ్ లోనే.. రాజమౌళి డైరెక్షన్‌లో వ‌చ్చిన‌ సింహాద్రి బ్లాక్ బస్టర్ కావడంతో.. తర్వాత వచ్చిన సినిమాలు ప్రేక్షకుల అంచనాలను రీచ్ కాలేక ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో తారక్‌ ఎంతో టార్చర్ అనుభవించాడట. తను నటించిన ప్రతి సినిమా ప్లాప్ అవడంతో చాలా డిప్రెసె అయ్యాడట. అయితే ప్రస్తుతం తారక్ దేవ‌ర‌ లాంటి పాన్ ఇండియ‌న్ స‌క్స‌స్‌తో మంచి ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అంతే కాదు ప్రస్తుతం తారక్ లైనప్ కూడా ఫుల్ బిజీగా ఉంది.