టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అక్కగా, తల్లిగా, చెల్లిగా, వదినగా ఇలా ప్రతి పాత్రలోను నటించి మెప్పించిన హేమ.. బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్ కూడా డామినేట్ చేసేలా తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీకి.. హేమాకు మధ్యన ఓ కనెక్షన్ ఉందన్న సంగతి చాలా మందికి తెలిసిఉండదు. ఇంతకి ఆ కనెక్షన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రతి సినిమాలోని స్టార్ హీరో, హీరోయిన్లుగా నటించే వారికి డూప్స్ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. సినిమాల్లో వచ్చే అన్ని సన్నివేశాల్లో హీరో, హీరోయిన్లు నటించడానికి కుదరదు.
కొన్ని కష్టమైన సన్నివేశాల్లో వాళ్ళకి బదులు అచ్చం వాళ్ళ పోలికలతోనే ఉన్న డూప్ లను పెట్టుకోవాల్సి వస్తుంది. వారితోనే ఆ సన్నివేశాలు తెరకెక్కిస్తూ ఉంటారు. ఎక్కువగా హీరోలకి డూప్‌లు కనిపిస్తారు. ఏదైనా అడ్వెంచర్స్ సీన్స్ లో హీరోలు నటించేందుకు ఇష్టపడకపోతే.. డూప్‌ను పెట్టి ఆ సీన్ ముగించేస్తారు. ఇక శ్రీదేవి తెలుగు తో పాటు ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి అప్పట్లోనే పాన్ ఇండియా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే శ్రీదేవి టాలీవుడ్ లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న బ్లాక్ బస్టర్ సినిమాల్లో చిరంజీవి హీరోగా వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా కూడా ఒకటి.
ఇది ఇప్పటికీ ఆడియన్స్‌లో ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలిచిపోయింది. అయితే ఈ సినిమా షూట్ టైంలో శ్రీదేవి పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హేమ నటించిన.. అదే సమయంలో శ్రీదేవికి డూప్ అవసరమైతే.. శ్రీదేవి డూప్‌గాను ఆమె కనిపించారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో నీళ్లలో దిగి స్విమ్మింగ్ చేసే సన్నివేశాల్లో శ్రీదేవి అసలు నటించనని నాకు స్విమ్మింగ్ చేయడం రాదని చెప్పేసారట. అప్పుడు శ్రీదేవి ప్లేస్ లో హేమని పెట్టి ఆ సీన్స్ రూపొందించారు. అలా ఈ సినిమాల్లో శ్రీదేవికి డూప్‌గా హేమ కనిపించింది.