అక్కినేని ఫ్యామిలీ నుంచి థర్డ్ జనరేషన్ హీరోగా.. నాగార్జున నటవారసుడిగా నాగచైతన్య ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జోష్ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన చైతన్య.. మొదటి సినిమాతోనే తన నటనకు ఎంతోమంది విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఎంతో మెచ్యూర్డ్ యాక్టర్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్న చైతు.. 2010లో గౌతమ్ మినన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఏమాయ చేసావే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలవడమే కాదు.. ఆడియన్స్‌లో చైతన్య క్రేజ్ కూడా విపరీతంగా పెరిగింది.
అలాగే ఈ సినిమా తర్వాత నాగచైతన్య అమ్మాయిలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. తర్వాత సినిమా డైరెక్షన్ లో వచ్చిన 100% లవ్ సినిమాతో మరోసారి విజయం దక్కించుకున్న చైతన్య.. బ్యాక్ టు బ్యాక్ అవకాశాలను అందుకున్నాడు. అలా ఇప్పుటి వరకు చైతన్య 28 సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక చైతూ వ్యక్తిగత విషయానికి వస్తే.. స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించే వివాహం చేసుకున్నాడు. ఏ మాయ చేసావే సినిమా టైంలో చాలా కాలం ప్రేమించుకున్న ఈ జంట.. 2017 అక్టోబర్ 7న ఎంతో గ్రాండ్ లెవెల్లో వివాహం చేసుకున్నారు.
పెళ్లైన కొన్ని సంవత్సరాలకి మనస్పర్ధలతో ఈ జంట విడిపోయారు. 2021లో డివోర్స్ తీసుకున్నారు. సమంతతో విడాకుల తర్వాత చైతు వరస సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యాడు. తర్వాత ఈ అక్కినేని హీరో మరో స్టార్ హీరోయిన్ శోభితతో డేటింగ్ చేసి.. గత ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక డిసెంబర్ 4న నాగచైతన్య, శోభిత వివాహం చేసుకోబోతున్నారు. చాలా సింపుల్గా కేవలం 300 మంది సమక్షంలో వీరిద్దరి పెళ్లి జరగబోతుందని నాగార్జున ఇటీవల వెల్లడించాడు.
ఇక చైతు ప్రస్తుతం చందు మండేటి డైరెక్షన్లో తండేల్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అలాగే చైతన్య.. తను నెక్స్ట్ సినిమా కూడా విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ దండుతో చేయనున్నాడు. ఇక నిన్న చైతన్య పుట్టినరోజు సందర్భంగా దాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. ఇలా వరుస సినిమాలతో చైతు ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నాడు.