టాలీవుడ్ హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలు కాకముందే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అందం.. అమాయకత్వంతో ఆకట్టుకున్న లావణ్య.. వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకుని మెగా ఇంటి కోడలుగా మారింది. తాజాగా వీరి పెళ్ళై వన్ ఈయర్ కూడా కంప్లీట్ అయింది. ఇక ఎప్పటికప్పుడు వీరిద్దరికి సంబంధించిన రొమాంటిక్ పిక్స్, ఫోటోషూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కాగా లావణ్య మెగా ఇంటి కోడలుగా మారిన తర్వాత అమ్మడి పాపులారిటీ మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు. ఇలాంటి క్రమంలో లావణ్య త్రిపాఠి చిక్కుల్లో ఇరుక్కుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్‌తో వివాహం కాకముందు లావణ్య హీరోయిన్గా ఓ రొమంయాంటిక్ ప్రాజెక్టును ఒప్పుకుందట. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత కొన్ని కారణాలతో బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆపేశారు. అయితే ఎలాగూ సినిమా క్యాన్సిల్ అయింది కదా అని.. లావణ్య కూడా సైలెంట్ అయిపోయిందట. అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకోవడం నెగ్లెట్ చేసింది. కాగా ఇప్పుడు లావణ్య మెగా ఇంటి కోడలు అయిన తరుణంలో.. ఆమె స్టేటస్ ని ఉపయోగించుకొని తమ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆ డైరెక్టర్ మరోసారి లావణ్యతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఆ అగ్రిమెంట్ను పదేపదే లావణ్య కు పంపిస్తూ మీరు ఈ ప్రాజెక్టులో నటించాల్సిందే అంటూ మొండి పట్టు పట్టాడట.
ఇక ఈ విషయంలో లావణ్యది ఏమాత్రం తప్పులేకున్నా.. ఆ ప్రాజెక్ట్ కమిట్ అయిన కారణంగా.. అప్పుడు ప్రాజెక్టును క్యాన్సిల్ చేసినా.. తను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయలేదు కాబట్టి.. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నారట. అయితే ఈ రొమాంటిక్ సినిమాలు చేయడానికి లావణ్య కు అసలు ఇష్టం లేదట. కానీ ఆమె చేసిన అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసుకోకపోవడంతో ఆమె అడ్డంగా ఈ సమస్యలు ఇరుక్కుపోయింది. ఇలాంటి క్రమంలో లావణ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
ఇక ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. మెగా ఫ్యాన్స్ ఆ డైరెక్టర్ పై మండిపడుతున్నారు. మెగా ఇంటి పరువు తీయడానికి మెగా ఫ్యామిలీ పై ట్రోల్ చేసేందుకు.. ఓ సాకు కోసమే ఇలాంటివన్నీ చేస్తున్నారని.. లావణ్య త్రిపాఠి లీగల్ గా ప్రొసీడ్ అవ్వడమే కరెక్ట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మెగా కోడలు లావణ్య త్రిపాఠి కానీ.. అటు మెగా ఫ్యామిలీ కానీ ఎవ్వరూ రియాక్ట్ అవలేదు. మరి కొంతమంది ఏమో అసలు ఇలాంటి మిస్టేక్ ఏది జరిగి ఉండదని.. మెగా ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు కావాలనే ఈ వార్తలను సృష్టిస్తున్నారని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.