అల్లు అర్జున్ కు శ్రీ లీలా ఇంట్రెస్టింగ్ గిఫ్ట్.. బన్నీ పోస్టు వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్లో కమర్షియల్ హీరోయిన్ గా మంచి ఇమేజ్‌ సంపాదించుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉంది శ్రీలీల. ఈ అమ్మడు ఇప్ప‌టికే దాదాపు ప‌ది సినిమాలో న‌టించినా కెరీర్‌లో ఇప్పటి వర‌కు ధ‌మాకా రూపంలో ఒక్క సక్సెస్ మాత్రమే అందింది. అయితే ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంతో శ్రీ‌లీల‌ ఆడియన్స్ను పలకరించింది. ఈ మూవీ కూడా సక్సెస్ సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే శ్రీ లీల సినీ కెరీర్ నెమ్మదించింది. అయితే ఈ సినిమాలో అమ్మడి డ్యాన్స్‌కు మాత్రం మంచి ఇమేజ్ వచ్చింది. ఇక త్వరలోనే శ్రీ‌లీలా.. నితిన్ కు జోడిగా రాబిన్‌హుడ్ సినిమాల్లో కనిపించనుంది. డిసెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.

Sree leela: శ్రీలీల వేగం తట్టుకోగలరా.. పుష్ప 2 | Sree Leela to Dance with  Allu Arjun in Pushpa 2 analysis mnm

డిసెంబర్ 5న రిలీజ్ కాబోయే మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ పుష్ప 2లోను ఐటమ్ క్వీన్‌గా శ్రీ లీల మెరవనుంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డాన్సర్లలో ఒకరైన అల్లు అర్జున్‌తో డాన్సింగ్ క్వీన్‌ శ్రీ లీల ఐటమ్ సాంగ్ అంటే అభిమానుల్లో ఏ రేంజ్ లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు టాలెంటెడ్ డాన్సర్ స్టేజి మీద చేసే మూమెంట్స్ చూడాలని ఫ్యాన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సాంగ్ కంప్లీట్ అయిన తర్వాత శ్రీ లీలా.. బన్నీ తో పాటు తన ఫ్యామిలీ మొత్తానికి గిఫ్ట్స్‌తో పాటు ఇంట్ర‌స్టింగ్ లెట‌ర్లు పంపింది. ఈ క్రమంలోనే కలర్ లెటర్స్ తో గిఫ్ట్ ప్యాక్ ను ఇచ్చింది. అలా బ‌న్నీ తన ఇన్స్టా వేదికగా ఆమె రాసిన లెటర్ను షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలియజేశాడు.

ఆమెను డ్యాన్సింగ్ క్వీన్ గా వర్ణిస్తూ.. అల్లు అర్జున్ స్టేటస్ షేర్ చేయడం విశేషం. నువ్వు పంపించిన గిఫ్ట్ ఇప్పుడే చూసా అందులో నువ్వు రాసిన లెటర్ నా హాట్ కు టచ్ అయింది. నీ ప్రేమకి నా ధన్యవాదాలు అంటూ బన్నీ శ్రీలీలను మెన్షన్ చేశాడు. అలాగే ఆమె రాసిన లెటర్ ని కూడా షేర్ చేశాడు. అంతేకాదు.. బన్నీ భార్య స్నేహ రెడ్డి కూడా శ్రీలీల లెటర్ ను షేర్ చేసుకుంది. ఇందులో స్నేహ రెడ్డి ఆతిధ్యానికి ధన్యవాదాలు శ్రీ లీల తెలియజేసింది. తనని అద్భుతంగా ఆదరించిన ఫ్యామిలీ మొత్తానికి శ్రీలీలా లెటర్తో థాంక్స్ చెప్పింది. దీంతో.. బన్నీ, స్నేహ రెడ్డి చేసిన పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. పుష్ప 2 మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నా ఉంటానంటూ.. శ్రీలలా, అల్లు అర్జున్ కు పంపిన మరో లెటర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.