సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారికి ఎలాంటి క్రేజ్, పాపులారిటీ ఉంటుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ఏ చిన్న విషయమైనా నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. అలా తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ హీరోయిన్ ఒకే ఏడాదిలో రెండు పెళ్లిళ్లు చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది ఎవర్ని అని అనుకుంటున్నారా.. ఆమె మరెవరో కాదు శ్రీజిత.
ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుని స్టార్ హీరోయిన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. మొదట కసౌతి జిందగీ కే.. సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తిరుగులేని స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాతో ఒక్కసారిగా వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా కరణ్ అప్నా అప్ప, తషాన్, లవ్ కా ది ఎండ్ ,మాన్సూన్, సూట్ అవుట్ ఇలా వరుస సినిమాల్లో నటించి మెప్పించింది. కెరియర్ మంచి పిక్స్ లో ఉన్న టైంలో మైఖేల్ క్లోన్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక అప్పటినుంచి వీరిద్దరి కి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తుంది.
కాగా ఈ ముద్దుగుమ్మ తాజాగా షేర్ చేసిన పిక్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. అయితే తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు మరేవో కాదు.. తన్న భర్త మైకెల్‌ను రెండోసారి బెంగాలీ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నట్లుగా అనిపిస్తున్నాయి. శ్రీజిత రెడ్ కలర్ సారీ తో బంగారు ఆభరణాలతో మెరిసిపోయింది. ఇక మైఖేల్ కూడా బెంగాలీ సాంప్రదాయ దుస్తుల ఆకట్టుకున్నాడు. ఇలా ఒకే ఏడాదిలో తన భర్తను రెండుసార్లు వివాహం చేసుకొని అభిమానులను ఆశ్చర్యపరిచిన శ్రీజిత.. సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఈ క్రమంలోనే అమ్మడి ఫొటోస్ చూసిన ఎంతో మంది ప్రముఖులు, అభిమానులు ఆమెకు విషస్ తెలియజేస్తున్నారు.