నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి మోక్షజ్ఞ ఇంటర్వ్యూ ఇవ్వనున్నాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ డబ్యూ ఉందని అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇక ఈ సినిమాకు బాలయ్య చిన్న కూతురు తేజస్విని ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుంది. మోక్షజ్ఞ మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలనే మాస్టర్ ప్లాన్ తో రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో విలన్ ఎవరు అనే అంశంపై ఆడియన్స్ లో మొదటి నుంచి ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినిమాలో విలన్ గా ఓ ప్రముఖ స్టార్ హీరో కొడుకు ఎంట్రీ ఇవ్వనున్నాడట. ఇంతకీ అతను ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు దృవ్ విక్రం అని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ, ధృవ్ ఈ సినిమాలో విలన్‌గా తీసుకోవాలని భావిస్తున్నాడట. ఇప్పటికే అతనికి కథ కూడా వినిపించారని.. అతను దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం తమిళ్లో స్టార్ హీరోగా మంచి ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న దృవ్.. టాలీవుడ్‌లో కూడా తండ్రిలా తనదైన మార్కెట్ క్రియేట్ చేసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నాడు. అయితే తెలుగులో హీరోగా కన్నా విలన్‌గా ఎంట్రీ ఇస్తే ఇంపాక్ట్ బాగుంటుందని ఆలోచనల్లో దృవ్ ఉన్నాడట.
ఈ క్రమంలోనే మోక్షజ్ఞతో తలపడే పవర్ఫుల్ విలన్ గా ధ్రువ్ కనిపించబోతున్నాడని సమాచారం. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు కానీ మోక్షజ్ఞ సినిమాలో దృవ్ ఉన్నది నిజమైతే మాత్రం నిజంగా అది నందమూరి ఫ్యాన్స్ కు పండగే అవుతుంది. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానున్న క్రమంలో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మేకర్స్ అఫీషియల్గా ప్రకటించనున్నారని సమాచారం. పురాణాల నేపథ్యంతో భారీ బడ్జెట్ తో హనుమాన్‌కు మించిన కంటెంట్ తో ఈ సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం.