టాలీవుడ్ స్టార్ సింగర్స్ గా అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట వివాహ బంధంతో ఒకటయ్యారట. శుక్రవారం హైదరాబాదులో వీరిద్దరూ ప్రైవేట్ మ్యారేజ్ చేసుకునే ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. ఇరు కుటుంబాలు, అతి తక్కువ మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుకలు జరిగిందని తెలుస్తోంది. అయితే వీరిద్దరిది లవ్ మ్యారేజ్ ఆ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి వివాహానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ఇప్పటికీ రాలేదు.
అంతేకాదు ఇద్దరి పెళ్లి గురించి టాలీవుడ్కు సంబంధించిన ఏ ఇతర సింగర్స్ కూడా ఎలాంటి పోస్టులను అభిమానులతో షేర్ చేసుకోలేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలను పాడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన అనురాగ్ కులకర్ణి.. ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. కేరాఫ్ కంచరపాలెం సినిమాలో.. ఆశ పాశం సాంగ్ ఏ రేంజ్ లో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ఆర్ఎక్స్ 100 లో పిల్లా.. రా.. సాంగ్ కూడా భారీ పాపులారిటి దక్కించుకుంది. బుల్లితెరపై సూపర్ సింగర్ 8 సీజన్ విజేతగా నిలిచిన అనరాగ్.. నెమ్మదిగా సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఇక ఫిమేల్ స్టార్ సింగర్ రమ్య బెహరా సూపర్ సింగర్ ఫోర్ లో పాల్గొని సందడి చేసింది. బాహుబలి, టెంపర్, ఒక లైలా కోసం, ప్రేమ కథ చిత్రం ఇలా తన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె సింగింగ్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు అనురాగ్, రమ్య పెళ్లి నెట్టెంటా హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరూ కలిసి హే రంగులే.. సాంగ్‌కు పని చేశారు. ఈ పాట యూట్యూబ్లో మిలియన్ వ్యూస్‌ను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. వార్తల్లో వాస్తవం ఎంత తెలియాలంటే.. వాళ్ళు అఫీషియల్ ప్రకటన ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే.