టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ తో ఆడియన్స్‌ను పలకరించనునాడు. టైటిల్ కాస్తా డిఫరెంట్ గా అనిపించినా.. కంటెంట్ మరింత కొత్తగా ఉంటుందని ఆడియన్స్‌ను బాలయ్య మెప్పించడం ఖాయం అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ రిలీజ్ ఈవెంట్ ఇటీవల మేకర్స్ నిర్వహించారు. అందులో బాబీ మాట్లాడుతూ ఏ డైరెక్టర్ అయ్యినా మా నాన్నతో సమానమని.. బాలయ్య చెప్పారు అంటూ వివరించాడు. బాలయ్య నిజంగా కూడా మమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారంటూ వివరించాడు. బాలయ్య చిన్నపిల్లల సెట్స్ కు వస్తారని.. ఏది చెబితే అది చేస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు.
బాలయ్య లాంటి హీరోను నేను ఇప్పటివరకు చూడలేదు అంటూ వివరించిన బాబి.. డాకు మహారాజ్ సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకోవాలని.. దానికి ఇంకా చాలా ఈవెంట్లు ఉన్నాయంటే చెప్పుకొచ్చాడు. ఒక విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నా అంటూ బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాన్నీ షేర్ చేస్తున్నాడు బాబి. మిడ్ నైట్ 2 గంటలకు షూట్ అంటే.. యంగ్ హీరోలు కూడా ఎంతగానో ఆలోచిస్తారు. ఆ సమయంలో షూట్‌కు తడబడతారు. ఈ క్రమంలోనే 15 రోజుల పాటు మిడ్ నైట్ షూట్ ఉంటుంది. డూప్ ను పెట్టి మేనేజ్ చేసేస్తామని బాలయ్యతో చెప్పాము. నేను కథ గుర్రం ఎక్కాల్సిందే.. అని చెప్పి బాలయ్య స్వయంగా నటించారంటూ బాబి వివరించారు.
ఇక ఆ టైంలో చేతిలో కాగడా పట్టుకునే సీన్స్ గురించి బాబి షేర్ చేసుకున్నాడు. ఫ్యాన్స్ అంచనాలను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తెరకెక్కించామని.. డైలాగ్స్ గురించి సినిమా చూశాక ఆడియన్స్‌కు బాగా క్లారిటీ వస్తుంది అంటూ వెల్లడించాడు. ఇక థమన్ మాట్లాడుతూ.. బాబీ ఎంత గొప్పగా సినిమా తీశారో.. అదే స్థాయిలో సంగీతం అందించడానికి ప్రయత్నించాలంటూ థమన్ వెల్లడించాడు. బాలయ్యతో ఇది నా ఐదో సినిమా అంటూ చెప్పిన థమన్.. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే ఆడియన్స్ కు డాకు మహారాజ్‌పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఈ సినిమా వచ్చేయడానికి సంక్రాంతి కానుకగా జనవరి 12న బరిలోకి దిగనుంది.