తారక్, పవన్, మహేష్ ముగ్గురితో ఆ స్టార్ హీరోయిన్ కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్, మహేష్ ఇంకా పాన్ ఇండియా సినిమాలో నటించకపోయినా.. వారికి తెలుగు సినిమాలు ఇతర భాషల్లోనూ ఎంతో మంది ఆడియన్స్ వీక్షిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు స్టార్ హీరోస్ కి పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే తారక్ యంగ్ టైగర్ గా, మహేష్ సూపర్ స్టార్ గా, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా క్రేజ్ ను పెంచుకోవడానికి కారణం ఓ సీనియ‌ర్ హీరోయిన్ అంటూ.. ఈ ముగ్గురికి ఆమె కారణంగానే స్టార్డం వచ్చిందంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ లక్కీ హీరోయిన్ ఎవరో.. ఆమె వల్ల వీళ్లకు స్టార్డం రావ్వడం ఏంటో ఒకసారి చూద్దాం.

Kushi Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos |  eTimes

ఆ హీరోయిన్ మరెవరో కాదు సీనియర్ బ్యూటీ భూమిక చావ్లా. ఢిల్లీలో జన్మించిన ఈ అమ్మడు సుమంత్ హీరోగా వచ్చిన ఒక్కడు సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయింది. పవన్‌తో ఖుషి సినిమాలో నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకుంది. పవన్ కెరీర్‌లోనే మొట్టమొదటి బ్లాక్ బ‌స్టర్ ఖుషి.. తర్వాత పవన్ కు టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. తమిళ్ డైరెక్టర్ ఎస్.జే సూర్య రూపొందించిన ఈ సినిమాలో పవన్ భూమిక కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జంటగా భూమిక నటించిన దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వ‌చ్చిన‌ సింహాద్రి లో ఇద్దరు కలిసి రొమాన్స్ చేశారు. సింహాద్రి రిలీజ్ కు ముందే తారక్‌ వరుసగా రెండు భారీ ఫ్లాపులను ఎదుర్కొన్నారు.

Nannedo Syeeamaku Full Song || Simhadri Telugu Movie || Jr Ntr, Bhoomika,  Ankitha

కెరీర్‌ డౌన్ ఫాల్ అవుతున్న క్రమంలో భూమిక.. ఎన్టీఆర్ తో సింహాద్రి నటించి ఆయనకు బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఈ సినిమా భారీ సక్సెస్ సాధించడమే కాదు అప్పట్లో రికార్డుల వర్షం కురిపించింది. ఎన్టీఆర్ను స్టార్ హీరోగా మార్చిన సినిమా కూడా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మహేష్ భూమిక కలిసి ఒక్కడు సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే.

Watch Okkadu (Telugu) Full Movie Online | Sun NXT

గుణశేఖర్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు ముందు మురారి, రాజకుమారుడు తప్ప మహేష్ మరి సినిమాలతోనూ సరైన సక్సెస్ అందుకోలేదు. అయితే ఒక్కసారిగా ఒక్కడు సినిమాతో మహేష్ కెరీర్ యు టర్న్ తిరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో మహేష్ కు స్టార్ హీరో ఇమేజ్ క్రియేట్ అయింది. అలా భూమిక కారణంగా తారక్, పవన్, మహేష్ ముగ్గురు స్టార్ హీరోలుగా మారి మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు స్టార్ హీరోల లక్కీ బ్యూటీ భూమిక అంటూ న్యూస్ వైరల్ గా మారింది.