” డాకు మహారాజ్ “కు బాలయ్య రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. చిరుని క్రాస్ చేశాడుగా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరస హీట్లను అందుకుంటు దూసుకుపోతున్న బాలయ్య.. మరోసారి తన స్టామినా చూపించడానికి సిద్ధమవుతున్నాడు. — రన్నింగ్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమాకు తాజాగా డాకు మహారాజ్ టైటిల్ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మేకర్స్‌ విషయాన్ని చిన్న టీజర్ తో అఫీషియల్ గా ప్రకటించారు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ నుంచి ఓ సినిమా వస్తుందంటే మినిమం హిట్ గ్యారెంటీ అన్న నమ్మకం డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు అభిమానుల్లోను కలిగింది. ఆయన యంగ్ గా ఉన్నప్పుడు కూడా చూడని పీక్‌ రేంజ్‌ స్టార్ స్టేటస్ ప్రస్తుతం తన ఆరుపదుల వయసులో అనుభవిస్తున్నాడు బాలయ్య.

డాకు మహారాజ్ గా బాలయ్య... చరణ్ కు పోటీగా రాబోతున్న బాలకృష్ణ

ఇదంతా పక్కన పెడితే ప్రముఖ డైరెక్టర్ బాబి కొల్లితో కలిసి.. తాజాగా నటించిన డాకు మహారాజ్ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. బాలయ్య కెరీర్‌లో మరో సూపర్ హిట్ ఖాయమంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా రూ.100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమాకు బాలయ్య రెమ్యునరేషన్ ఎంత అనే న్యూస్‌ హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య ఈ సినిమా కోసం తన కెరీర్‌లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్నాడని.. ఏకంగా రూ.45 కోట్ల రెమ్యున‌రేషన్ను ఛార్జ్ చేసినట్లు తెలుస్తుంది.

Interval bang next level in "Daku Maharaj". - PakkaFilmy

థియేట్రిక‌ల్ రైట్స్, డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్ బాగా జరిగే హీరోలకు నిర్మాతలు భారీ రెమ్యూనరేషన్‌ని ఇవ్వడం కామన్. ఇప్పుడు ఆ జాబితాలో బాలయ్య బాబు కూడా చేరిపోవడం విశేషం. అఖండ కి ముందు బాలయ్య కేవలం రూ.10 కోట్ల రమ్యునరేషన్తో నటించేవాడు. ఆ స్థాయి నుంచి నేడు ఆయన రూ.45 కోట్ల రేంజ్ కి వచ్చాడు. ఇదే స్పీడ్ లో మంచి కంటెంట్ను తీసుకుంటూ సినిమాల్లో నటిస్తే బాలయ్య రూ.100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే స్టేజ్కి వెళ్లిన ఆశ్చర్యం ఉండదు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య.. బోయపాటితో అఖండ‌ 2 రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించనున్నాడు. ఈ సినిమాపై కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. టాలీవుడ్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాను తెలుగుతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.