ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్న పేరు నాగచైతన్య. సమంతతో విడాకుల తర్వాత చైతన్య పేరు వైరల్ గా మారింది. ఇలాంటి క్రమంలో శోభిత ధూళిపాళ్లను ఎంగేజ్మెంట్ చేసుకొని సడన్ షాక్ ఇచ్చిన చై.. మరింత సంచలనంగా మారాడు. ఇలాంటి క్రమంలో రానా హోస్ట్ గా వ్యవహరిస్తున్న సరికొత్త టాక్స్ షో.. ది రానా దగ్గుబాటి షోలో చైతూ సందడి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈషో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈనెల 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే తాజాగా షోకి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్లో రానా ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీస్ అయినా రాజమౌళి, నాగచైతన్య, రిషబ్ శెట్టి , సిద్దు జనులగడ్డ, శ్రీ లీల, మెహికా బజాజ్ ఇలా అందరితో చిట్‌చాట్ చేస్తున్న షాట్స్ రిలీజ్ చేశారు.
ఇక ఇందులో నాగచైతన్య మాట్లాడిన మాటలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. రానా.. నాగచైతన్యను ప్రశ్నిస్తూ మీ కుటుంబం ఎలా ఉండాలని అనుకుంటున్నావు.. అని అడగ్గా నాగచైతన్య మాట్లాడుతూ సంతోషంగా వివాహం చేసుకొని.. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు ఉండాలని భావిస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగచైతన్య చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో సమంతకు ప్రస్తుతం ఉన్న పీక్ కెరీర్ రీత్యా అప్పుడే పిల్లలను కనడం ఇష్టం లేదని.. చైతుకి నో చెప్పిందట. అయితే నాగచైతన్యకు పిల్లలపై ఉన్న ఇష్టంతో వీరిద్దరి మధ్యన మనస్పర్ధలు ప్రారంభమయ్యాయని.. దీంతో విడిపోవాలని డిసిషన్కు వచ్చినట్లు నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇక మీరిద్దరు విడిపోవడానికి కారణమేంటో ఇప్పటి వరకు నాగచైతన్య కానీ, అటు సమంత గాని ఇద్దరు నోరు మెదపలేదు.
దీంతో ఇలాంటి వార్తలు ఎన్నో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చైతు తండేల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. కార్తికేయ డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వంలో.. అల్లు అరవింద్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే షూటింగ్లో సర్వే గంగా పూర్తి చేస్తున్నారు మేకర్స్. ఇక తుది దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ కూడా తాజాగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత చైతు విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో సినిమాలో నటించనున్నాడు. అలాగే దూత వెబ్ సిరీస్ సీక్వెల్లో కూడా నాగచైతన్య నటించనున్నట్లు సమాచారం.