ధనుష్ నిజస్వరూపం ఇదే.. 3 పేజీల బహిరంగ లేఖతో న‌య‌న్ ఫైర్.. నీ నీచ బుద్ధి చూపించావంటూ..

కోలీవుడ్ యాక్టర్ ధనుష్ ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకొని సతమతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ధనుష్ విషయంలో మరో వివాదం చెలరేగింది. అయితే ఈసారి వివాదంలో ఇన్వాల్వ్ అయింది లేడీ సూపర్ స్టార్ నయనతార కావడంతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది. నయన్‌, ధనుష్.. గతంలో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అంతే కాదు ధనుష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సినిమాల్లోనూ నయన్ హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. తాజాగా నయన్‌.. ధనుష్ పై ఫైర్ అవుతూ అతని నిజ స్వరూపం ఇదేనంటూ మూడు పేజీల బహిరంగ లేఖతో సంచలన కామెంట్స్ చేసింది. ఈ లేఖలో ధనుష్ క్యారెక్టర్ ని తప్పుపడుతూ తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన నయన్.. 2015లో ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడి అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. విజ్ఞేష్ శివ‌న్‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాలో విజయ్‌సేతుపతి నయన్‌కు జంటగా నటించి మెప్పించారు.

Nayanthara Fires At Dhanush, here's why - TeluguBulletin.com

ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత నయన్‌, ధనుష్ మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయట‌. కాగా తాజాగా నయన్‌ తన పెళ్లి, కెరీర్.. లైఫ్ గురించి బయోపిక్ తరహాలో డాక్యుమెంటరీ సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తుంది. నయనతార బియాండ్ ది ఫెయిరీ టైల్ అనే టైటిల్ తో ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18న రిలీజ్ కానుంది. క్రమంలో తాజాగా మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్లో ధనుష్ నిర్మించిన నానం రౌడి దానాన్‌ సినిమాలోని పాటకు సంబంధించిన మూడు సెకండ్ల వీడియో డాక్యుమెంటరీని ఉపయోగించడం.. ధనుష్ అనుమతి లేకుండా వాడడం.. ఆయన సహించలేదు. నయనతారపై కోర్టులో ఏకంగా రూ.10 కోట్ల కాపీరైట్ కేసును రిజిస్టర్ చేశారు. కొన్ని రోజులపాటు నయన్‌, ధనుష్ మధ్య ఈ వ్యవహారంలో చర్చలు జరిగినా.. రాజీ కుదరకపోవడంతో నయనతారకు.. ధనుష్ పై విపరీతమైన కోపం ఉందట.

ఈ క్రమంలోనే ఏకంగా మూడు పేజీల లేకతో ఆమె ధనుష్ పై విరుచుకు పడింది. ఈ లేఖల ధనుష్ ను ఉద్దేశిస్తూ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తి కొడుకు.. ప్రముఖ డైరెక్టర్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించావంటూ వివ‌రించింది. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒంటరి పోరాటంతో ఎదిగిన నాపై.. నీకు ఇంత పగ ఉందని.. నీ నీచ బుద్ధి ఇలా బయటపెడతావని అనుకోలేదు. నాకు సంబంధించి ఆ డాక్యుమెంటరీ సినిమా రిలీజ్ కోసం నా ఫ్రెండ్స్, ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ రూపొందించడం వెనుక ఎంతోమంది కష్టం, సహాయం కూడా ఉంది. నా సినీ కెరీర్‌కి సంబంధించిన క్లిప్స్, అనేక విషయాలు డాక్యుమెంటరీలో పొందుపరిచా. నా శ్రేయోభిలాషులు చెప్పిన మాటలు కూడా అందులో ఉన్నాయి.

కానీ.. నా కెరీక‌ర్‌లో కీలకమైన నానుమ్‌ రౌడీ దానన్‌ సినిమాలోని క్లిప్స్‌ని మాత్రం ఉపయోగించలేకపోయా. దాని గురించి నన్ను ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా రిజెక్ట్ చేశావు. ఇది నా హార్ట్ బ్రేక్ చేసింది. బిజినెస్ లెక్కలు వేసుకుని.. నాపై ఉన్న కక్షతో నువ్వు కేసు వేశావు. నానుమ్ రౌడీ దానన్‌ సినిమాకు సంబంధించిన అన్ని క్లిప్స్ ఎడిటింగ్ లో తీసేసాం. నువ్వు అనుమతులు ఇవ్వలేదు కనుక అలా చేయక తప్పలేదు. ఈ సినిమాలోని పాటలు నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం. నా డాక్యుమెంటరీకి ఆ పాటలు బాగా సరిపోతాయి. కానీ.. తొలగించా. కేవలం షూటింగ్ మధ్యలో మొబైల్‌తో తీసిన మూడు సెకండ్ల క్లిప్ మాత్రం ఉపయోగించాం. దానిని తీయడం కుదరలేదు. అది కూడా బిటిఎస్ క్లిప్.

ఇక ఆ మూడు సెకండ్ల క్లిప్ కోసం రూ.10 కోట్ల కాపీ రైట్ కూడా వేసావంటే నువ్వు ఎంత దిగజారి పోయావో తెలుస్తోంది. నీ అసలు క్యారెక్టర్ అందరికీ అర్థమవుతుంది. అభిమానుల ముందు ఒకలా.. లోపల నీచ స్వభావం మరోలా ఉంచుకున్నావని మాకు తెలుసు. బయటకి ఒకలా.. లోపల మరోలా ఉంటూ నీ ఫ్యాన్స్ తో పాటు.. ప్రపంచాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. పదేళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాకు సంబంధించిన క్లిప్ 3 సెక‌న్లు వాడుకుంటేనే కేసు వేశావు. కనీసం మనసాక్షి ఉందా.. ప్రతిసారి నువ్వు నీ ఆహాన్ని చూపిస్తూనే ఉన్నావ్‌.

Netflix debuts trailer of Nayanthara: Beyond the fairy-tale - News India  Times

నీ సాటి వ్యక్తులు ఎదిగితే అసలు నువ్వు జీర్ణించుకోలేవు. ఈ ప్రపంచం చాలా పెద్దదని గుర్తుంచుకో. అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ సాధించిన వారి పట్ల అసలు ఓర్వలేని తనం చూపించకూడదు. జరిగిన వాస్తవాలు అన్ని మార్చేసి నీ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సరికొత్త కథలు అల్లుతావ్. అది కూడా నాకు తెలుసు.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం నయ‌న్‌ చేసిన.. కాంట్రవర్సీ కామెంట్స్ లేఖ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఇక ఈ డాక్యుమెంటరీ వివాదం పై ధనుష్ ఎలా రియాక్ట్ అవుతాడో వేచి చూడాలి.