సినీ ఇండస్ట్రీలో స్థూపర్ స్టార్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక జక్కన్న ఎప్పటికప్పుడు తన సినిమాలతో అభిమానుల అంచనాలను మించి బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబుతో లెరకెక్కించబోయే క్రేజీ ప్రాజెక్ట్ పై కూడా రాజమౌళి పక్క ప్లానింగ్ తో ఉన్నాడట.
ఈసారి పాన్ ఇండియా లెవెల్లో కాదు.. పాన్ వరల్డ్ రేంజ్ లో జక్కన్న తన సత్తా చూపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాతో మహేష్ ను సరికొత్త లుక్ లో చూపించనున్నాడని టాక్. ఇక మహేష్ బాబు సినిమాలతో పాటు.. పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా.. మరో పక్కన బిజినెస్ మ్యాన్ గాను రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఏ ఎం బి సినిమాస్, హుంబుల్ డ్రసెస్‌లో పార్ట్నర్ గా మారిన మహేష్.. దీనితో పాటు జిఎంబి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కు నిర్మాతగాను వ్యవహరిస్తున్నారు. ఇది మాత్రమే కాదు.. తాజాగా మహేష్ మరో నయా బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడంటూ న్యూస్ నెటింటా వైరల్ గా మారుతుంది.
దీంతో కోట్ల రూపాయల లాభాలను గడించేలా మాస్టర్ ప్లాన్ వేసాడట మహేష్. ఇంతకీ ఆ బిజినెస్ ఏంటో చెప్పలేదు కదా అదే సోలార్ బిజినెస్. ట్రూజన్ సోలార్ సన్టెక్ లిమిటెడ్.. తో కలిసి సవరశక్తి వ్యాపార రంగంలోకి మహేష్ ఎంట్రీ ఇవనున్నాడని సమాచారం. ఇందులో భారీ పెట్టుబడులతో కోట్ల లాభాలు గడించేలా మహేష్ ఆలోచనలో ఉన్నాడట. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఎనర్జీకి.. సూపర్ స్టార్ తోడైతే.. ఇండియాలో సోలార్ పవర్ కి తిరుగుండదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.