టాలీవుడ్ బాక్సాఫీస్‌కు సంక్రాంతి ఎంత స్పెషల్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాలు కచ్చితంగా మంచి కలెక్షన్లు రాబట్టి కాసుల వర్షం కురిపిస్తాయని మేకర్స్ తో పాటు హీరో, హీరోయిన్లు కూడా నమ్ముతూ ఉంటారు. అందుకే సంక్రాంతి చాలామంది స్టార్ సెలబ్రిటీలకు సెంటిమెంట్ గా మారింది. అయితే సంక్రాంతి బరిలో నిలవాలంటే కంటెంట్ తో పాటు ప్రేక్షకులను మెప్పించే అంశాలు కూడా సినిమాల్లో ఎన్నో ఉండాలి. అప్పుడే సంక్రాంతి బరిలో అయినా సక్సెస్ సాధించగలరు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసినందుకు ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసేసాయి. ఇప్పటివరకు సంక్రాంతికి మేము వస్తున్నాము అంటే.. మేము వస్తున్నాము అంటూ.. చాలా సినిమాలు పోటీపడినా.. ఏ సినిమా రిలీజ్ డేట్ ఫైనల్ కాలేదు.
కానీ.. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్, వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం, సందీప్ కిషన్.. మజాకా, బాలయ్య.. డాకు మహారాజ్ సినిమాలు మాత్రం రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసి రిలీజ్‌కు కూడా సిద్ధం అయిపోయాయి. ఈ క్రమంలోనే కొంతకాలంగా ఈ సినిమాల విడుదల లెక్క హాట్ టాపిక్ గా మారింది. ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబో గేమ్ ఛేంజర్ జనవరి 10న సంక్రాంతి బరిలో దించనన్నారు. తర్వాత బాలయ్య – బాబి కాంబోలో డాకు మహారాజ్ జనవరి 12న ఆడియన్స్ను పలకరించనుంది. ఇక వెంకటేష్ – అనిల్ రావిపూడి.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పటికే వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీంతో వీరి కాంబినేషన్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
అయితే ఈ పోటీలో హీరో సందీప్ కిషన్ – త్రినాధరావు కాంబినేషన్ లో వస్తున్న మజాకా సినిమా కూడా ఉంది. మొదట జనవరి 14న సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించిన ఇప్పుడు సంక్రాంతి బర్లు తప్పుకోవాలని అనుకుంటున్నారట. అయితే ఏ సినిమా ఎక్కువగా ఆకట్టుకుంటే ఆ సినిమాకే థియేటర్స్ ఎక్కువ దొరుకుతాయి అనడంలో సందేహం లేదు. కాగా ఇప్పటికే థియేటర్స్ కేటాయింపు పై కూడా ఈ ఫోకస్ వెళుతుంది. మొదట గేమ్స్ ఛేంజర్ రిలీజ్ కానున్న క్రమంలో.. థియేటర్స్ ఎక్కువగా గేమ్ ఛేంజర్‌కు ఇచ్చి.. తర్వాత బాలయ్య.. డాకు మహారాజు రిలీజ్ అయిన తర్వాత రెండు సినిమాలకు సమానమైన థియేటర్లో అందించాలని డిస్ట్రిబ్యూటర్లు అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ఏ సినిమాకు అయి ఏ మూవీ టాక్ బాగుంటుందో.. ఆ సినిమాకు స్క్రీన్లు పెంచేలా ఒప్పందం చేసుకుంటున్నారని.. మొత్తానికి అన్ని సినిమాలు కూడా మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రానునట్లు సమాచారం. మరి ఏ సినిమా ప్రేక్షకులను.. ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.