నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రతిసారి.. బోయపాటి తన సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చి బాలయ్య కెరీర్‌కు అండగా నిలుస్తున్నారు. కాగా నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన మూడో సినిమా అఖండ.. ఎలాంటి బ్లాక్ బాస్టర్ రిజల్ట్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్య నుంచి వచ్చిన వరుస రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్లు గానే నిలిచాయి.
ఈ క్రమంలో హ్యాట్రిక్ హీట్లతో దూసుకుపోతున్న బాలయ్య.. తన 109వ సినిమాతో ఈ ఏడాది సంక్రాంతిలో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఇక ఈ సినిమా కూడా ఖచ్చితంగా సక్సెస్ సాధించడం ఖాయం అంటూ బాలయ్య అభిమానులు ఆశభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత.. బాలయ్య మరోసారి బోయపాటి డైరెక్షన్లో బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సీక్వెల్.. అఖండ 2 తాండవం సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ క్రమంలోనే అఖండ 2పై ఒక క్రేజీ అప్డేట్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది. అఖండ 2కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఓ ఈవెంట్లో పాల్గొన్న థమన్ మాట్లాడుతూ.. అఖండ 2పై సాలిడ్ అప్డేట్ను షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాకు ఇప్పటికే మ్యూజిక్ వర్క్స్ ప్రారంభమయ్యాయని.. ఓ పాట కూడా పూర్తి చేసేశామంటూ వెల్లడించాడు. ఇక అఖండలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు.. పాటలు కూడా ఎంతో హైలెట్గా నిలిచాయో చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే అఖండ 2 సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో థమన్ సినిమా సాంగ్స్ పై చేసిన కామెంట్స్ నెటింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ వార్త నిజంగానే నందమూరి అభిమానులకు పూనకాల లోడింగ్ అప్డేట్ అనడంలో సందేహం ఉండదు.