తనని డామినేట్ చేసిన నటుడిని బ్యాన్ చేసిన తారక్.. ఇకపై నాకు కనిపించొదంటూ ఫైర్.. !

ప్రస్తుతం జనరేషన్‌లో గొప్ప నటుడు ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చేది ఎన్టిఆర్ పేరే. ఎంతో మంది సీనియర్ స్టార్స్ కూడా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆయన డ్యాన్స్, ఆయన నటన, ఎలాంటి క్యారెక్టర్ లో అయినా ఒదిగిపోయే ఆయన కెపాసిటీ, అంతేకాదు సింగర్ గాను తార‌క్ తన‌దైన ముద్ర వేసుకున్నాడు. అలా తారక్ ఇండస్ట్రీలో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్‌నే.. ఓ సీనియర్ నటుడు డామినేట్ చేశాడట. దీంతో తారక్ కాస్త నొచ్చుకున్నాడని.. వెంటనే ఆయనకు.. బాబు ఇక నీకు నాకు అయిపోయింది.. ఇకపై నువ్వు నాకు కనిపించదు అంటూ ఫైర్ అయ్యాడని తెలుస్తుంది.

Jr NTR Superb Words About Jagapathi Babu | Aravinda Sametha | Manastars -  YouTube

ఈ విషయాన్ని స్వయంగా ఆ సీనియర్ యాక్టర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇంతకీ ఆ నట్టుడు మరి ఎవరో కాదు జగపతిబాబు. ఎన్టీఆర్, జగపతిబాబు కలిసి అరవింద సమేతలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జగపతిబాబు బసిరెడ్డి పాత్రలో పవర్ ఫుల్ విలన్ గా.. ఫ్యాక్షనిస్టుగా నటించి మెప్పించాడు. ఇక ఈ విషయం గురించి జగపతిబాబు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకు బసిరెడ్డి పాత్రలో ఏగ్రెసివ్ రోలు ఇచ్చారని.. తారక్‌కు పాజిటీవ్‌ రోల్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అయితే తారక్ ఈ సినిమా షూట్ చేస్తున్నాను రోజులు.. రాత్రులు ఫోన్ చేసి మరి నన్ను వాయించేవాడని.. నువ్వు నన్ను ఇట్లా చేస్తున్నావ్.. అట్లా చేస్తున్నావ్.. నీ క్యారెక్టర్ బాగుంది అంటూ ప్రేమగానే తిట్టేవాడని.. అవన్నీ ఓకే అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చాడు.

Jagapathi Babu's role in 'Aravindha Sametha' is scary

అయితే అరవింద సమేత ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏకంగా ఫస్ట్ బసిరెడ్డి అందరికీ గుర్తుంటాడు. తర్వాత నేను గుర్తుంటాను అంటూ స్వయంగా వివరించాడని.. అంత పెద్ద హీరో అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం నిజంగా సాహసం అంటూ వివరించాడు. వెంటనే నాతో.. బాబు ఇక మీకు నాకు అయిపోయింది.. మీరు తారక్ తోనే ఆడుకుంటున్నారు.. అది కుదరదు. నాకు మ‌రో నాలుగైదేళ్ళు కనిపించకండి అంటూ చెప్పాడని.. ఇన్ డైరెక్ట్ గా తన సినిమాల్లో నన్ను నటించవద్దని చెప్పేసాడని జగపతిబాబు వివరించాడు. ఇక అరవింద సమేత వీర రాఘవ 2018లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పటికీ ఆరేళ్లు గడిచిన ఎన్టీఆర్ కేవలం రెండు సినిమాల్లోనే నటించారు. వాటిలో ఆర్‌ఆర్ఆర్ సినిమా ఒకటి. మరొకటి దేవర. ఈ రెండు సినిమాల్లోనూ జగపతిబాబు కనిపించలేదు. ఇక ప్రస్తుతం తారక్.. హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మల్టీస్టారర్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత దేవర పార్ట్ 2 కూడా ఎన్టీఆర్ చేయాల్సి ఉంది.